గ్రామ అభివృధి కి సహకరిస్తా
నెేటి దీినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం:
ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సాయి పద్మజ కత్తెర గుర్తుతో ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామ అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన లక్ష్యంగా ఆమె పోటీ చేస్తున్నారు. మాజీ సర్పంచ్ పోచిరాజు బాబురావు కుమార్తెగా గ్రామంలో పరిచయం ఉన్న ఆమెకు తండ్రి గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు కుటుంబ నేపథ్యంగా నిలుస్తున్నాయి.
గ్రామ సర్పంచ్‌గా గతంలో పోచిరాజు బాబురావు పనిచేసిన సమయంలో వాడపల్లిలో పంచాయతీ భవనం, వాటర్ ట్యాంక్, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. గ్రామంలోని విద్యాసంస్థలకు భారీగా భూములు విరాళంగా అందించడంతో పాటు, కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి కూడా స్థలం దానం చేసి సామాజిక సేవలో తనదైన ముద్ర వేశారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి బాబురావు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. గ్రామంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం, గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ సాయి పద్మజ ఓటర్లను మద్దతు కోరుతున్నారు. వాడపల్లి అభివృద్ధికి సేవ చేసే అవకాశం కల్పించాలని, సర్పంచ్ ఎన్నికల్లో తన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.