పెదగదిలి ప్రభుత్వ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
ఆరిలోవ, మేజర్ న్యూస్ : జీవీఎంసీ, 17వ వార్డు పెదగదిలి ప్రభుత్వ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్. అంబేద్కర్ గురించి విద్యార్థులకు వివరిస్తూ.. రాజ్యాంగానికి సంబంధించిన పీఠికను ప్రతిజ్ఞ చేయించి, విద్యార్థులు చే (డ్రాయింగ్ కాంపిటీషన్) నిర్వహించి, ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవడానికి విద్య ఎలా ఉపయోగపడుతుంది అనే అంశంపై పోటీలను నిర్వహించి అద్భుతంగా వేసిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జె. సింహాచలం, సహ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.