జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ప్రసంగి వాసు
ఆరిలోవ, మేజర్ న్యూస్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోగల 16 వ వార్డు, ఆరిలోవ ప్రాంతానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రసంగి వాసు మర్యాదపూర్వకంగా జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కష్టపడి, పని చేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు. అధినేత జగన్మోహన్ రెడ్డి ని కలిసే అరుదైన అవకాశం కల్పించిన వైఎస్ఆర్సిపి విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు,విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు కి వాసు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.