బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి.
బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి.
ఉదయగిరి, మేజర్ న్యూస్.
ఈనెల 29న మండలంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల అధికారులు బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించాలని ఎంపీడీవో సుకుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్టేజీ-2 అధికారులకు మాస్టర్ సమీవుల్లా, ఫణిరాజ్ లు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ప్రవర్తనా నియమావళికి లోబడి విధులు నిర్వహించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతిఒక్కరు సహకరిం చాలన్నారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.