BREAKING
ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్ విద్యార్థుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి..

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హౌస్ అరెస్ట్

Select Suryaa Now
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హౌస్ అరెస్ట్


-ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణం కల్పించాలి
-మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం, నవంబర్ 26, మేజర్ న్యూస్ 
స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే, 73, 74వ రాజ్యాంగ సవరణల తర్వాత ఇవి కూడా రాజ్యాంగబద్ధమైన ఎన్నికలుగానే భావించాల్సి ఉంటుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇలాంటి ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల్లో పాటించాల్సిన పద్ధతులు, నిబంధనలు, నియమావళిని ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాజ్యాంగబద్ధమైన సంస్థ రూపొందించిన ఆ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే.పౌరులు, రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు, వారికి ఏజెంట్లుగా ఉన్నవారు, పోలింగ్ జరుగుతున్న సిబ్బంది, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అన్ని రకాల అధికారులు.. వీరందరూ ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారు. వారందరూ ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రధాన రాజకీయ పార్టీకి ఎన్నికల ఏజెంట్‌గా ఉన్న వ్యక్తిని మీరు వెళ్లవద్దని ఆపే అధికారం ఎస్పీకి గానీ, కలెక్టర్‌కు గానీ లేదు. అంటే మీరే ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తున్నారు.మీరు నియమావళిని అతిక్రమించలేదని భావిస్తున్నప్పుడు, నన్ను నిర్బంధించడానికి గల కారణాలను అధికారికంగా పేపర్‌పై రాసి ఇవ్వాలని అడుగుతున్నాను. నా వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని, నేను ఏజెంట్‌గా ఉన్నప్పటికీ నన్ను నిర్బంధిస్తున్నామని రాతపూర్వకంగా ఇవ్వాలని అడుగుతున్నాను.
మీరు ఒకవైపు పనిచేసే అధికారులు కాదనుకుంటే, కేవలం చంద్రబాబు చెప్పే మాటలను మాత్రమే పాటిస్తున్నారా?  చంద్రబాబు కారణంగానే ఇలా వ్యవహరిస్తున్నారూ .ప్రజాస్వామ్యంలో పౌర సమాజమే ఈ విషయాలను అర్థం చేసుకుని తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో పౌరులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. ఆ స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణాన్ని మనమే కల్పించుకోవాలి. పౌరులందరూ ఓటు వేసి చంద్రబాబుకు బుద్ధి చెప్పండి.
వాళ్లు చేస్తున్న చర్యలు చట్టవిరుద్ధమైనవి. అందుకే ఆ పేపర్ నాకు ఇవ్వలేకపోతున్నారు. బలవంతంగా నన్ను ఆపుతున్నారు. దౌర్జన్యంగా నిర్బంధిస్తున్నారు. అంతకుమించి వారు ఏమీ చేయలేరు.
పోలీసులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించడం లేదు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పౌరులు, ఏజెంట్లు, అభ్యర్థులు, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు.. ఎన్నికల ప్రక్రియలో భాగమైన ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను, చట్టాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నది పోలీసు, రెవెన్యూ అధికారులే.
అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీని సమర్థించే చర్యలు తప్ప ఇందులో మరొకటి కనిపించడం లేదు. నేను జనరల్ ఏజెంట్‌గా ఉంటే అక్రమాలు నా దృష్టికి వస్తాయనే భయంతో, అక్రమాలకు పాల్పడేందుకు వీలుగా జనరల్ ఏజెంట్‌ను అడ్డుకుంటున్నారు. నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అన్యాయాలను ఎదిరించే, తిరుగుబాటు స్వభావం కలిగిన శక్తివంతమైన ప్రజాస్వామిక చైతన్యం మన సమాజంలో ఉంది. వారందరూ ఈరోజు పెద్ద ఎత్తున అధికార పార్టీకి వ్యతిరేకంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇలాంటి అక్రమ చర్యలను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా సమర్థించరని భావిస్తున్నాను.శాంతిభద్రతలకు విఘాతం కేవలం వైఎస్సార్‌సీపీ ఏజెంట్ వల్లే కలుగుతుందా? జనరల్ ఏజెంట్‌ను నిర్బంధిస్తారా? అసలు ఏజెంట్లే లేకపోతే పోలీసులే ఓట్లు గుద్దేయాలనుకుంటున్నారా? ఇది పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. చంద్రబాబుకు పరిపాలన చేయడం చేతకావడం లేదు. నాలుగు గోడల మధ్య బలప్రదర్శన చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమకు ఇష్టమైన ప్రతినిధులను స్వేచ్ఛగా ఎన్నుకునే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అది రాజ్యాంగబద్ధమైన విధి. ఆ బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని నేను భావిస్తున్నాను. ఈరోజు నాకు ఆటంకం కలిగించిన అధికారులందరి వివరాలను నమోదు చేసుకున్నాం. సమయం వచ్చినప్పుడు వారికి తగిన సమాధానం చెబుతాం. ఈ విషయంపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో మాట్లాడాను. ఐజీతో, ఎస్పీతో, కలెక్టర్‌తో కూడా మాట్లాడాను. అయినప్పటికీ వారంతా ప్రభుత్వానికి కొమ్ముకాయాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఎన్నికలు సజావుగా జరగకుండా పోలీసులే అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎన్నికల ఏజెంట్లను అడ్డుకునే అధికారం పోలీసులకు లేదు. ఒక రాజకీయ పార్టీకి చెందిన ఏజెంట్‌ను మీరు నిర్బంధిస్తున్నారంటే, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే వారికి మీరు ప్రోత్సాహం అందిస్తున్నట్లే.
ఈరోజు నన్ను ఒక వ్యక్తిగా కాకుండా, ఒక రాజకీయ పార్టీకి చెందిన జనరల్ ఏజెంట్‌గా చూడాలి. నేను జనరల్ ఏజెంట్‌ను కాదని పోలీసులు అంటున్నారు. మరి రిటర్నింగ్ ఆఫీసర్ నాకు ఏ హోదాలో అధికారికంగా అనుమతి పత్రం ఇచ్చారు?  ఏదైనా సమస్య వస్తే, ఆ సమస్యను సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చంద్రబాబు ఆదేశాలకు లొంగి పనిచేస్తున్న అధికారులే ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్నారు.