BREAKING
ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్ విద్యార్థుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి..

రాజ్యాంగ స్ఫూర్తిని మరిచారు...!

Select Suryaa Now
రాజ్యాంగ స్ఫూర్తిని మరిచారు...!


- కానరాని రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
-  నరసన్నపేట మండలంలో అధికారుల తీరుపై విమర్శలు.

నరసన్నపేట నవంబర్ 26 మేజర్ న్యూస్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వివిధ కార్యాలయాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ వేడుకలు నిర్వహించారు. అయితే నరసన్నపేట మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించిన దాఖలాలు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి ప్రజాస్వామ్య విలువలను అందించే గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులతో పాటు విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించే దిశగా రాజ్యాంగం మార్గదర్శకంగా నిలుస్తోంది.

ఇంతటి విశిష్టత కలిగిన రాజ్యాంగం గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఎంతైనా ఉంది. రాజ్యాంగంలోని విలువలు, పౌరుల హక్కులు, విధులు, ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.

కానీ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లోనే రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించకపోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించడం, రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయడం వంటి కార్యక్రమాలైనా నిర్వహించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను వినియోగించుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగం అదే రాజ్యాంగం పట్ల గౌరవాన్ని చాటుకునే కార్యక్రమాల నిర్వహణలో ఎందుకు నిర్లక్ష్యం వహించిందన్న ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులోనైనా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.