BREAKING
జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్ విద్యార్థుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి.. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో ఘనంగా మైక్రోబయాలజీ విభాగం రజతోత్సవాలు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హౌస్ అరెస్ట్ విక్రమ సింహపురి వర్సిటీలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ నిర్మాతకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఘన నివాళి.. విద్యార్థిని అభినందించిన అధ్యాపకులు సైన్స్ ఫెయిర్ వేదికగా రాజకీయ రగడ! హరీశ్ రావు విమర్శలు.. దరిపల్లి చంద్రం కౌంటర్.. అధికారుల మౌనం! ఓటు హక్కు వినియోగించున్న ధర్మాన కుటుంబం పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నేడు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ జ్ఞానజ్యోతి పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని మరిచారు...!

పద్మనాభంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

Select Suryaa Now
పద్మనాభంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

పద్మనాభం, మేజర్ న్యూస్: విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ పద్మనాభం మండలంలో గురువారం సుడిగాలి పర్యటన చేపట్టారు . ఈ పర్యటన మండలంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

కృష్ణాపురం, రెడ్డిపల్లిలో ప్రభుత్వ భూముల పరిశీలన..!!

కృష్ణాపురం, రెడ్డిపల్లి రెవెన్యూ గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ భూములను పరిరక్షించాలని, ఆక్రమణలకు గురికాకుండా చూడాలని ఆర్డీవో సంగీత్ మాధుర్,పద్మనాభం తహశీల్దార్ శైలజను ఆదేశించారు.ప్రభుత్వ భూముల వివరాలు, సర్వే నంబర్లు, ఆక్రమణల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏ భూమి ఎక్కడ ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉంది, ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే వివరాలను రికార్డులతో సహా పరిశీలించారు.

జిల్లాలోనే అత్యధిక ప్రభుత్వ భూములు పద్మనాభంలోనే..!!

విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న మండలం పద్మనాభం మండలమే కావడం విశేషం. అందుకే జిల్లా యంత్రాంగం ఈ మండలంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.అది కూడా భోగాపురం విమానాశ్రయానికి అతి తక్కువ దూరంలో పద్మనాభం మండలం ఉండటంతో ఈ ప్రభుత్వ భూములకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఏర్పడనుంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాకతో పద్మనాభం మండలం అభివృద్ధిలో దూసుకుపోతుందని, పరిశ్రమలు, వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.అందుకే ప్రభుత్వ భూములను ఇప్పటి నుంచే సంరక్షించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలకు గురికాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భీమిలి ఆర్డిఓ సంగీత్ మాధుర్,పద్మనాభం తహశీల్దార్‌ శైలజను ఆదేశించారు.

ఎంఎస్ఎంఈ పార్క్ సందర్శన..!!

కృష్ణాపురం రెవెన్యూ గ్రామంలో నిర్మాణ దశలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్కును కలెక్టర్ సందర్శించారు. పార్కులో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈ పార్క్ పూర్తయితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, చిన్న పరిశ్రమలకు ఊతం లభిస్తుందని అన్నారు.

కలెక్టర్ పర్యటనతో అప్రమత్తమైన యంత్రాంగం..!!

కలెక్టర్ పర్యటనతో మండలంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.