బెనెకల్ లో రీకౌంటింగ్ జరగాలంటూ వందలాది మంది జనసేన కార్యకర్తలతో ఆందోళన - రాయదుర్గం ఇంచార్జి మంజునాథ్ గౌడ్ డిమాండ్!!
కనేకల్ మండలం బెనెకల్ గ్రామ సర్పంచ్ ఎన్నికల ఫలితంపై ఉద్రిక్తత కొనసాగుతోంది. రీకౌంటింగ్ జరగాలంటూ వందలాది మంది జనసేన కార్యకర్తలు, గ్రామ ప్రజలతో కలిసి రాయదుర్గం నియోజకవర్గ ఇంచార్జి కరేగౌడ్ర మంజునాథ్ గౌడ్ ఆందోళన చేపట్టారు,జనసేన పార్టీ అభ్యర్థి కురువ పోతప్ప 118 ఓట్ల తేడాతో గెలిచినట్లు అధికారులు మొదట డిక్లేర్ చేశారు. అయితే టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఎర్రి స్వామి దౌర్జన్యాలకు పాల్పడి డిక్లరేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళిపోయాడని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు,దీంతో వందలాది మంది ప్రజలు కౌంటింగ్ కేంద్రం వద్ద గుమిగూడారు. ఒక్కటే డిమాండ్... రీకౌంటింగ్ జరగాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు,అయినా కనేకల్ మండల ఎంపీడీవో అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది,న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని, రీకౌంటింగ్ జరిపించి తీరుతామని మంజునాథ్ గౌడ్ స్పష్టం చేశారు. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.