BREAKING
పెదగదిలి ప్రభుత్వ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సంతు సేవాలాల్ మహారాజ్ విగ్రహం, ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి తరలిన రూప దీప నైవేద్య భోగ్ బాబోజీల వాహనాలు కాంగ్రెస్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్ . తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాలి.. చారిత్రక పద్య నాటకాలు యువతలో స్ఫూర్తిని నింపాలి: ప్రజా గాయిని వేముల పుష్పక్క నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఓటు హక్కుకు రక్షణగా పోలీసు పహారా! ఎన్నికల సందర్బంగా బస్ సర్వీసుల తగ్గింపు బెనెకల్ లో రీకౌంటింగ్ జరగాలంటూ వందలాది మంది జనసేన కార్యకర్తలతో ఆందోళన - రాయదుర్గం ఇంచార్జి మంజునాథ్ గౌడ్ డిమాండ్!! మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ గ్రామ అభివృధి కి సహకరిస్తా ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర

ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం

Select Suryaa Now
ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో  -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం

ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో 
-అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం 
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
ఆత్మకూరు అనాదిగా పట్టణం, నాడు తాలూకా కేంద్రం, నేడు రెవిన్యూ డివిజన్ కేంద్రం, మెయిన్ రోడ్డు ను గతంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విస్తరించారు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు, మంచి విద్యా వైద్య సదుపాయాలు కల్పించి అధునాతన భవనాలు నిర్మించారు. వ్యాపార సంస్థలు ఆధునికరించారు. అన్ని శాఖల కార్యాలయాలు, జిల్లా ప్రభుత్వ వైద్యశాల అన్ని ఏర్పాటు చేశారు. అయితే అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందంగా మెయిన్ రోడ్డు ఇరువైపులా ఒక ప్రక్క  ఎండోమెంట్ స్థలాలు, మరో ప్రక్కన వక్ఫ్ స్థలాలు ఉండడంతో పట్టణ శోభ తలపించడం లేదు. రోడ్డుకి ఇరువైపులా పెద్ద హోటళ్లు,దుకాణాలు, షో రూములు ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేదందున చిన్నపాటి రేకుల షెడ్లలో దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు సాగిస్తుంటారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. పంట కాలువలు కూడా పూడిపోయి ఉన్నాయి. రోడ్లమీద గోవులు, మేకలు, కుక్కలు సంచరిస్తుంటాయి. పట్టణం నడిబొడ్డున మున్సిపల్ బస్టాండ్  నిర్మించినా త్రాగునీటికి ఇబ్బంది పడుతుండగా నిత్యాన్నదాత కంచి పరమేశ్వర్ రెడ్డి త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు. అక్కడ ఫలహార శాల కానీ హోటల్ కానీ లేవు. పట్టణంలో ఒక తిప్ప ఉండగా తిప్పపై ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాలు ఉండగా పట్టణాన్ని రాత్రివేళ ఊరు వెలుపల నుండి చూస్తుంటే లైట్లతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది. కానీ పట్టణంలోకి వస్తే ఆ శోభ కానరావడం లేదు. చెరువు వద్ద సుందరీకరణకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చర్యలు తీసుకొంటున్నారు. కానీ పట్టణంలో ఇతర పట్టణంలో లాగా ఆకర్షణీయంగా షోరూములు, హోటళ్లు ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేదు. మెయిన్ రోడ్డుకు ఒకవైపు వక్ఫ్ స్థలము, మరోవైపు ఎండోమెంట్ స్థలం ఉన్నందున దుకాణాల ఏర్పాటుకు వీలు కావడం లేదు. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో గతంలో పొలాలుగా ఉన్న వాటిని పలువురు స్థలాలుగా కొనుగోలు చేసి అధునాతన భవనాలు నిర్మించుకున్నారు. కానీ ప్రధాన రహదారి మాత్రం ఆధునికరణ కావడం లేదు. మంత్రి, అధికారులు చొరవ చూపి ఎండోమెంట్, వక్ఫ్ స్థలాలను అనుమతి పొంది కొంతమంది భవనాలు నిర్మాణాలకు అనుమతి ఇస్తే ఆకర్షణీయంగా మారగలదని పలువురు భావిస్తున్నారు. మరి అలాంటి చర్యలు చేపడతారేమో చూడాల్సి ఉంది.