ఆత్మకూరు పట్టణ ప్రజలకు మంత్రి ఆనం మరో కానుక
ఆత్మకూరు పట్టణ ప్రజలకు మంత్రి ఆనం మరో కానుక
--48.50 లక్షలతో నూతన రైతు బజార్ నిర్మాణానికి నిధులు మంజూరు
--మహిళలకు, వినియోగదారులకు మరింత మెరుగైన వసతులు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
ఆత్మకూరు పట్టణ ప్రజలకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరో అభివృద్ధి కానుకను అందించారు.ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని మహిళలు, కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలులో మరింత సౌలభ్యం కల్పించడంతో పాటు రైతులకు మెరుగైన మార్కెటింగ్ వసతులు అందించాలనే లక్ష్యంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ప్రాంగణంలో రూ.48 లక్షల 50 వేలతో నూతన రైతు బజార్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.
ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు ద్వారా పరిపాలనా, బడ్జెట్ అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.