BREAKING
దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర గిరిజన ఆడపడుచులకు అండగా ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆత్మకూరు పట్టణ ప్రజలకు మంత్రి ఆనం మరో కానుక బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు బాంబు బెదిరింపు కలకలం.. తనిఖీల అనంతరం నకిలీ కాల్‌గా నిర్ధారణ పదవి కోసం కాదు..వరిగొండ అభివృద్ధి కోసం..! -రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తా..! -ప్రచారంలో చినబాబి రెడ్డికి బ్రహ్మరధం..!!! (తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్) ఆత్మగౌరవానికి ఆలయం.. ఆధ్యాత్మికతకు నిలయం! సేవాలాల్ నామస్మరణతో మద్దిమడుగులో సందడి గిరిజన గుండెల్లో కొలువైన సేవాలాల్‌కు ఆలయ నిర్మాణం సేవాలాల్ ఆలయ నిర్మాణంలో భాగస్వామైన ఎమ్మెల్యే బాలు నాయక్ నెల్లూరు జిల్లాలో వర్షపాతం లోటు.. 33 మండలాల్లో తక్కువ వర్షాలు బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు బాంబు బెదిరింపు కలకలం.. తనిఖీల అనంతరం నకిలీ కాల్‌గా నిర్ధారణ.. జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ భారీగా ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు – సాయంత్రంలోగా ఫలితాల వెల్లడికి చర్యలు భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనం రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపీ వద్దిరాజు తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు*

రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది -అంబేద్కర్ లా కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

Select Suryaa Now
రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది  -అంబేద్కర్ లా కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ఎడ్యుకేషన్ స్టాప్ రిపోర్టర్ : భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రొఫెసర్ ఎస్.వి.పుల్లారెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ లా కళాశాలలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26వ తేదీని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలు, చట్టబద్ధ పాలన, పౌరుల హక్కులు, బాధ్యతల ప్రాధాన్యతను ప్రముఖులు వివరించారు. కళాశాల ఛైర్మన్ డాక్టర్ ఆర్ తిప్పారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకల్పనలో రాజ్యాంగ పరిషత్ సభ్యులు కలలుగన్న సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బిజయ కుమార్ బెహెరా మాట్లాడుతూ రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, విధుల ప్రాధాన్యతను వివరించారు. డాక్టర్ సమ్మయ్య మాట్లాడుతూ అణగారిన, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు కీలకమని వివరించారు. జూలీ మేడమ్ మాట్లాడుతూ మహిళా సాధికారత, లింగ సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ, సమాన అవకాశాల ప్రాధాన్యతను వివరించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పుల్లారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్