సీఎం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ విజయ మునిశేఖర్ రాయల్
తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుమల పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వ్యవసాయ కళాశాల హెలిపాడ్ వద్ద గురువారం 46 వ డివిజన్ కార్పొరేటర్ విజయ మునిశేఖర్ రాయల్, ఆమె భర్త టిడిపి తిరుపతి పార్లమెంట్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి మునిశేఖర్ రాయల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులను మునిశేఖర్ రాయల్ దంపతులు స్వీకరించారు. ప్రజలకు అందుబాటులో ఉండివారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలను పొంది ప్రజా నేతలుగా గుర్తింపు పొందాలని సీఎం చంద్రబాబు సూచించారు.
H. Dwaraka, staff reporter
9705347341