BREAKING
మహిమలూరు లో నిరుపయోగ నిర్లక్ష్య భవనం --నిధులు వృధా,స్థలదాతల వ్యధ గ్రామ అభివృధి కి సహకరిస్తా ఆత్మకూరుకు పట్టణ శోభ యోగం ఎన్నటికో -అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని చందం దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర గిరిజన ఆడపడుచులకు అండగా ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆత్మకూరు పట్టణ ప్రజలకు మంత్రి ఆనం మరో కానుక బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు బాంబు బెదిరింపు కలకలం.. తనిఖీల అనంతరం నకిలీ కాల్‌గా నిర్ధారణ పదవి కోసం కాదు..వరిగొండ అభివృద్ధి కోసం..! -రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తా..! -ప్రచారంలో చినబాబి రెడ్డికి బ్రహ్మరధం..!!! (తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్) ఆత్మగౌరవానికి ఆలయం.. ఆధ్యాత్మికతకు నిలయం! సేవాలాల్ నామస్మరణతో మద్దిమడుగులో సందడి గిరిజన గుండెల్లో కొలువైన సేవాలాల్‌కు ఆలయ నిర్మాణం సేవాలాల్ ఆలయ నిర్మాణంలో భాగస్వామైన ఎమ్మెల్యే బాలు నాయక్ నెల్లూరు జిల్లాలో వర్షపాతం లోటు.. 33 మండలాల్లో తక్కువ వర్షాలు బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు బాంబు బెదిరింపు కలకలం.. తనిఖీల అనంతరం నకిలీ కాల్‌గా నిర్ధారణ..

ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలి గైర్హాజరైతే క్రమశిక్షణా చర్యలు తప్పవు – కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్)

Select Suryaa Now
ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలి  గైర్హాజరైతే క్రమశిక్షణా చర్యలు తప్పవు – కలెక్టర్ హిమాన్షు శుక్లా  నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్)

ఎన్నికల విధులకు కేటాయించిన ప్రతి అధికారి, సిబ్బంది తప్పనిసరిగా తమకు కేటాయించిన విధులకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, గైర్హాజరైనా సంబంధిత వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియను గురువారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో ర్యాండమైజేషన్ విధానం ద్వారా పారదర్శకంగా నిర్వహించారు.

జిల్లాలోని 14 మండలాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 2,714 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 763 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 1,951 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. వీటికి 1,951 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,951 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 451 మంది ఇతర పోలింగ్ సిబ్బంది కలిపి మొత్తం 4,353 మంది సిబ్బందిని కేటాయించారు. అదనంగా 480 మంది రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 4,833 మందిని నియమించారు.

సున్నితమైన పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు 208 మంది మైక్రో అబ్జర్వర్లు, 42 మంది రిజర్వ్ మైక్రో అబ్జర్వర్లు కలిపి మొత్తం 250 మందిని కేటాయించారు.

ఈ నెల 30న కావలి, గూడూరు మున్సిపాలిటీలు, అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు 144 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. కావలిలో 60, గూడూరులో 72, అల్లూరులో 12 టేబుళ్లు ఏర్పాటు చేయగా, వీటికి 144 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 288 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు కలిపి 432 మంది సిబ్బందిని నియమించారు. 20 శాతం రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 516 మందిని కౌంటింగ్ విధులకు కేటాయించారు.

మొత్తం 13 కౌంటింగ్ హాళ్ల పర్యవేక్షణకు 26 మంది మైక్రో అబ్జర్వర్లు, ఆరుగురు రిజర్వ్ మైక్రో అబ్జర్వర్లు కలిపి 32 మందిని నియమించారు.

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సిబ్బంది కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధులకు నియమితులైన ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు సహకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధన్ రెడ్డి, సీపీఓ లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.