BREAKING
లోక కళ్యాణార్థం కోటి మంత్ర యజ్ఞం సంపూర్ణం భక్తిశ్రద్ధలతో 1 కోటి 38 లక్షల మంత్ర జపం పూర్తి. నెల్లూరు చరిత్రకు సాక్షిగా నిలిచిన పాత పెన్నా వంతెన మూడు దశాబ్దాల సేవకు ‘గ్రామ పీఠం’ పిలుపు.. వేమగిరి బరిలో ప్రజావైద్యుని కుటుంబం! నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు గ్రహగతుల ప్రభావం? 111 కోర్సులకు గీతం ప్రవేశ పరీక్ష గ్యాట్`2027 ఏయూ తైక్వాండో పురుషుల జట్టును అభినందించిన డైరెక్టర్ ఆఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎ. పల్లవి బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవను కలిసిన చొక్కాకుల దంపతులు.. పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం 14 వ వార్డు గాంధీనగర్ లో గెడ్డ ఆక్రమణ భక్తిశ్రద్ధలతో శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి లక్ష కుంకుమార్చన.. పోలమాంబ దేవాలయంలో అయ్యప్ప స్వాముల నిత్య అన్నదానం తుమ్మలగుంట పంచాయతీ ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం... టిడిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి మోడెం పూజ అయ్యప్ప ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా గ్రామ సేవా సంఘం విమ్స్ ఆసుపత్రి ప్రాంగణం రహదారి కాదు - వాహనదారులు ఆసుపత్రి లోపలి మార్గాన్ని ఉపయోగించవద్దు - విమ్స్ డైరెక్టర్ డాక్టర్ మన్మథరావు నెల్లూరు గ్రామీణంలో సత్తా చాటిన సత్తా చాటేసిన కోటంరెడ్డి సోదరులు

హెల్తీ విలేజ్ ఫుడ్ వింగర్ బీన్స్..! -దక్షిణాసియాలో లభించే మొక్క..!! -ప్రస్తుతం పెద్దచెరుకూరులో సాగు..!!! (తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్)

Select Suryaa Now
హెల్తీ విలేజ్ ఫుడ్ వింగర్ బీన్స్..! -దక్షిణాసియాలో లభించే మొక్క..!! -ప్రస్తుతం పెద్దచెరుకూరులో సాగు..!!! (తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్)

భారతదేశంలో అత్యంత అరుదు గా కనిపించే వింగ్డ్ (రెక్కల చిక్కు డు)లో ఆరోగ్యానికి సంబంధించి బహుళ పోషకాలు లభిస్తాయని రైతు గండవరపు శరత్ రెడ్డి చె బుతున్నా రు. దక్షిణాసియా, ఆ గ్నేసియాసియా దేశాలలో అధికం గా లభించే ఈ వింగ్డ్ బిన్స్ ప్రస్తు తం నెల్లూరు జిల్లా నెల్లూరు రూ రల్ మండలం పెద్ద చెరుకూరులో రైతు శరత్ రెడ్డి తన తోటలో సా గు చేస్తున్నారు. ఈ సందర్బంగా రైతు శరత్ రెడ్డి "సూర్య మేజర్ న్యూస్"తో వింగ్డ్ బిన్స్ ప్రత్యేకత ల గురించి వివరించారు. 
         వింగ్‌డ్‌ బీన్‌ (సోఫోకార్పస్‌ టెట్రాగోనోలోబస్‌) ప్రొటీన్లు పు ష్కలంగా ఉన్న ఒక రకం చిక్కు డు పంట. మిగతా చిక్కుడు కా యల కన్నా ఇది చాలా విభిన్నం గా ఉంటుంది. ఈ చిక్కుడు కా యకు నాలుగు ముఖాలు ఉంటా యి. అందువల్ల ఈ తీగ జాతి కూరగాయ మొక్కకు ‘రెక్కల చి క్కుడు’ అని పేరొచ్చింది. ఉష్ణ మండల ప్రాంతాల్లో చక్కగా పె రుగుతుంది. ఆసియా దేశాలకు బాగా అనుకూలమైనదైనా, ఇప్ప టి వరకు  తెలుగు రాష్ట్రాల్లో పెద్ద గా సాగు చేయని పంట ఇది. ఆ కుకూర పంట. దుంప పంట. ప ప్పు ధాన్యపు పంట కూడా. ప్రతి కూల వాతావరణ పరిస్థితులను దీటుగా తట్టుకొని దిగుబడినిచ్చే అద్భుత పంట వింగ్డ్ బీన్స్.
        బహుళ పోషకాలు కలిగిన ఈ వింగ్డ్ బీన్ ను ప్రాంతాలను బ ట్టి పలు పేర్లు కలిగి వుందని శర త్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా వింగ్డ్ బీన్, దీనిని సిగరిల్లాస్, గోవా బీన్, ఫోర్-యాంగిల్డ్ బీన్, ఫోర్-కార్నర్డ్ బీన్, మనీలా బీన్, ప్రిన్సెస్ బీన్, స్టార్ బీన్, కామ్రంగి బీన్, పీ, లేదా డ్రాగన్ బీన్ అని కూడా పిలుస్తారని ఇది ఒక ఉష్ణ మండల గుల్మ జాతికి చెందిన చి క్కుడు మొక్క అని రైతు చెప్పా రు. దక్షిణాసియా మరియు ఆగ్నే యాసియాలోని వినియోగదారు లు మరియు రైతులు వింగ్డ్ బీన్‌ ను దాని బహుళ ఉపయోగాలు మరియు వ్యాధి నిరోధకత కార ణంగా విస్తృతంగా గుర్తిస్తారని శ రత్ రెడ్డి చెప్పారు. వింగ్డ్ బీన్ పో షకాలు అధికంగా లభించే ఈ మొక్కలోని అన్ని భాగాలు తిన దగినవేనన్నారు. చిక్కుడు జాతి కి చెందిన ఈ వింగ్డ్ బీన్స్ అత్యం త పోషక విలువలున్న తీగ జాతి కూరగాయ మొక్క. దీని కాయల కు నాలుగు వైపులా రెక్కల వం టి అంచులు ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని రైతు శరత్ రె డ్డి తెలిపారు. దీని ప్రత్యేకత ఏ మిటంటే, మొక్కలోని ప్రతి భాగం (కాయలు, గింజలు, ఆకులు, పు వ్వులు, వేరు దుంపలు) తినడా నికి పనికొస్తుంది.
ముఖ్య లక్షణాలు  :
      కాయలు మరియు గింజలు. లేత కాయలను సాధారణ చిక్కు డు కాయల లాగే కూరలు, వేపు ళ్లు లేదా సలాడ్లలో వాడుకోవ చ్చు. ఎండిన గింజలలో సోయా బీన్‌తో సమానమైన ప్రోటీన్ ఉం టుంది. దీని ఆకులు, పువ్వు లు బచ్చలికూర లాగా వండుకుని తి నవచ్చు. పువ్వులను సలాడ్లు లే దా వంటకాలకు రంగు, రుచి కో సం ఉపయోగిస్తారు. నేల లోపల పెరిగే దీని దుంపలను బంగాళ దుంపల లాగా ఉడికించి లేదా కా ల్చుకుని తినవచ్చని ఆయన చె ప్పారు. 
ఆరోగ్య ప్రయోజనాలు  :
          ఇందులో మాంసకృత్తులు (ప్రోటీన్), పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుందని తెలి పారు. విటమిన్లు మరియు ఖని జాలు. విటమిన్ ఏ, సీ ఫోలేట్, ఐరన్, కాల్షియం వంటి పోషకా లు శరీర రోగనిరోధక శక్తిని మరి యు ఎముకల బలాన్ని పెంచు తాయి. తక్కువ ఖర్చుతో ఎక్కు వ పోషకాలను అందించడం వల్ల దీనిని 'సూపర్ ఫుడ్' గా కూడా గుర్తిస్తారని చెప్పారు. 
సాగు విధానం  :
       ఇది ఉష్ణమండల వాతావర ణంలో చాలా సులభంగా పెరుగు తుందని శరత్ రెడ్డి తెలిపారు. 
ఇంటి పెరట్లో లేదా మిద్దె తోటల్లో పందిరి వేసి సులభంగా పెంచుకో వచ్చు. దీనికి తెగుళ్ల బెడద కూ డా చాలా తక్కువ. హెల్తీ విలేజ్ ఫుడ్ వింగర్ బీన్స్  లో ఫైబర్ అ ధికంగా ఉంటుందని, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, ‌ హృ దయ ఆరోగ్యానికి మేలు చేస్తా యని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తక్కువగా ఉప యోగించ బడుతున్నప్పటికి ఈ వింగ్డ్ బీన్ ఉష్ణమండల ప్రాంతా లలో ఈ బింగ్డ్ బీన్ ఒక ప్రధాన బహుళ- ఉపయోగ ఆహార పం టగా గుర్తింపు పొందిందని రైతు శరత్ రెడ్డి తెలిపారు. ఏదేమైనా 
దక్షిణాసియా మరియు ఆగ్నే యాసియాలో మాత్రమే లభించే బహుళ పోషకాలు కలిగిన ఈ వింగ్డ్ బీన్ ను జిల్లా ప్రజలకు అందుబాటులో పెద్దచెరుకూరులో సాగు చేస్తున్న రైతు శరత్ రెడ్డిని శాఖాహారులు అభినందిస్తున్నారు.