BREAKING
యాడ్ ట్రైబ్ అవార్డ్స్ - సౌత్ 2026’కు శ్రీకారం డిసెంబర్ 15 వరకు ఎంట్రీలు స్వీకరణ వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! అధికారులతో కలిసి ఆర్ యుబీ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట అంగన్వాడి రిక్రూట్మెంట్ సంబంధించి అభ్యంతరాలు స్వీకరణ చేయడం జరిగింది. వైభ‌వంగా హైద‌రాబాద్ ఒడిస్సీ నృత్యోత్స‌వం బాధితుడికి,మాజీ కార్పొరేటర్ మురుగేష్ పరామర్శ రూ 5000 ఆర్థిక సహాయం అందజేత రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి.. నషాముక్త్‌ భారత్‌ పాదయాత్రకు బీజేపీ నాయకుల సంఘీభావం జాతీయ దగ్గు దినోత్సవ ప్రచారం ద్వారా గిన్నిస్ రికార్డు బాధిత కుటుంబానికి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 2027 పర్యాటక గమ్యస్థానంగా భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు కూటమి అభ్యర్థులను గెలిపించండి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా.. డీఎస్పీ దైవప్రసాద్.

దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట

Select Suryaa Now
దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట
సోమాజిగూడ /మేజర్ న్యూస్:1 దేశంలోనే తొలిసారిగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను పూర్తిస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక పైలట్ ప్రాజెక్టులో భాగంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుల స్వీకరణ నుంచి కేసుల దర్యాప్తు, ఛార్జిషీట్ దాఖలు వరకు వివిధ పోలీసు సేవలను అత్యాధునిక ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ మహేష్ మురళీధర్ భగవత్, ఐపీఎస్‌లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న ఏఐ సాంకేతిక పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.   అలాగే ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ మురళీకృష్ణ, పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ జహంగీర్ యాదవ్‌లతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేస్తున్న ఏఐ సాంకేతిక మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్న పైలట్ ప్రాజెక్టును త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పోలీసింగ్ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఆకున్ సబర్వాల్, హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ అండ్ ఎస్‌ఐటీ) ఎం. శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ డీఐజీ భాస్కరన్, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, టీఎస్‌పార్క్ ఎస్పీ రూపేష్, డీసీపీ అరవింద్ బాబు (ఎస్‌ఎంఐటీ) తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.