హిమాయత్‌నగర్, మేజర్ న్యూస్ : జాతీయ దగ్గు దినోత్సవ ప్రచారం ద్వారా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సాధించిందని డాక్టర్ రెడ్డీస్ ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సీఐఎస్‌యూఆర్ విభాగాల సీఈఓ సందీప్ ఖండేల్వాల్ బుధవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 29,188 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు రబ్బరు స్టాంపులతో వీడియోలు రూపొందించడంతో ఈ రికార్డు నమోదైనట్లు చెప్పారు. ముంబైలోని కంపెనీ కార్యాలయంలో గిన్నిస్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసినట్లు చెప్పారు. వైద్య నిపుణులు, తమ బృందాల సమష్టి కృషికి దక్కిన గుర్తింపుగా ఈ విజయాన్ని అభివర్ణించారు. దగ్గుపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ప్రచారం లక్ష్యమని తెలిపారు.