telangana
బాధిత కుటుంబానికి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : చంపాపేట్ డివిజన్ పరిధిలోని పోచమ్మ గడ్డ లో నివాసం ఉండే బాలకృష్ణ కుమారుడు అభిరామ్(16 సంవత్సరాలు)పుట్టినప్పటి నుంచి వినికిడి సమస్యలతో బాధపడుతున్నారు. ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ని సంప్రదించారు.వెంటనే స్పందించిన సుధీర్ రెడ్డి వారి చికిత్సకు అవసరమైన వివరాలను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా దరఖాస్తు చేయించారు.దానికి గాను వినికిడి సమస్య తీవ్రంగా ఉన్నవారికి వినడానికి సహాయపడే ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ పరికరం కోసం ఆరు లక్షల రూపాయలు(6,00,000)ఎల్.ఓ.సీ మంజూరు కాగా,ఆ చెక్కును బాధిత తండ్రి బాలకృష్ణ కి అందజేశారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడం తమకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాకేష్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.