BREAKING
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా *ఇటిక్యాలలో అనుమతి లేకుండా మత ప్రచారం.. స్థానికుల ఆందోళన* హుస్నాబాద్ నియోజకవర్గంలో అలింకో శిబిరాలకు విశేష స్పందన *అనంతసాగర్‌లో తెలంగాణ భూ సర్వే ప్రారంభం* మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ సంప్రదాయాలకు ప్రతీకగా చెల్లాపూర్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి బెస్తరపల్లిలో గడ్డివాని దగ్ధం.. 5 లక్షల వరకు ఆస్తి నష్టం. 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు భారత్ బయో ఎకానమీ నంద్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు భారత్ 2.5 మిలియన్ డాలర్ల సాయం లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా శ్రీలంక పార్లమెంట్ నేపాల్ వరదల్లో గల్లంతైన 213 మంది భారతీయుల మరణ ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభం ఏరో ఇండియా 2027కు రికార్డు స్థాయిలో స్పందన ఎంఎస్ఎంఈ నమోదులలో 10 కోట్ల మైలురాయి

సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి

Select Suryaa Now
సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి

మేడ్చల్, మేజర్ న్యూస్ : ఎండల ప్రభావంతో నీటి సరఫరా తగ్గి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొంగళ్ల మల్లారెడ్డి తన వంతు సహకారం అందించారు. గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ బోరుకు సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు.ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో గ్రామాల్లో నీటి సరఫరా తగ్గి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పూడూరు గ్రామంలోని రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ యాదగిరి ఇంటి వద్ద ఉన్న పాత ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావడం గ్రామస్తులకు ఊరటనిచ్చింది. ప్రజల మంచినీటి అవసరాలను గుర్తించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి బోరును పునరుద్ధరించిన గొంగళ్ల మల్లారెడ్డిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా దేవక మహేష్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో గొంగళ్ల మల్లారెడ్డి చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి, ప్రజల అవసరాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని గొంగళ్ల మల్లారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవక మహేష్ తదితరులు పాల్గొన్నారు.