BREAKING
ఇంటి దొంగతనం కేసును ఛేదించిన ఘట్‌కేసర్ పోలీసులు.. 10 మంది అరెస్ట్‌, మరొకరు పరారీ ప్రముఖ క్రైస్తవుల సత్కారానికి నామినేషన్లు ఆహ్వానం:జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎం. సుధీర్ మేదినిపూర్లో జీవిత బీమా పథకం ప్రారంభం ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన రూడా చైర్మన్ బాలవికాస్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ మంజూరు సర్పంచ్ సున్నం సుదర్శన్ దిర్సంపల్లిలో ఉచిత వైద్య శిబిరం నైట్ కోర్టు కు వ్యతిరేకంగా కోర్టు విధులు బహిష్కరించిన… ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి… కూటమి అభ్యర్థి ముమ్మర ప్రసారం అభివృద్ధి హామీలతో స్వతంత్రం అభ్యర్థి సత్యనారాయణ గ్రామ రజక సంఘం అధ్యక్షులుగా రాచకొండ కనకయ్య నాడు భూమి ఉంటేనే రైతు బీమా.. నేడు భూమి లేకున్నా కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబబీమా! క్రీడారంగంలో ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మరో ఘనత - కళాశాల చైర్మన్ .వెంకట రామిరెడ్డి *పల్లెలపై కోరలు చాస్తున్న ఫైనాన్స్ భూతం!* మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Select Suryaa Now
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సూర్య, నంద్యాల బ్యూరో:జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. మొదటి విడతలో భాగంగా జిల్లాలోని 8 మండలాల పరిధిలో 107 గ్రామపంచాయతీల్లో 975 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం మొత్తం 183 పోలింగ్ కేంద్రాల లొకేషన్ల పరిధిలో 773 పోలింగ్ గదులను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.*

*మండలాల వారీగా ఎన్నికల ఏర్పాట్ల వివరాలు*

*ఆళ్లగడ్డ: 14 గ్రామపంచాయతీలు, 127 వార్డులు, 24 పోలింగ్ కేంద్రాల లొకేషన్లు. సమస్యాత్మక - 2, అత్యంత సమస్యాత్మక - 6*

*చాగలమర్రి: 15 గ్రామపంచాయతీలు, 142 వార్డులు, 25 పోలింగ్ కేంద్రాల లొకేషన్లు. సమస్యాత్మక - 2, అత్యంత సమస్యాత్మక - 3*

*దొర్నిపాడు: 5 గ్రామపంచాయతీలు, 41 వార్డులు, 10 పోలింగ్ కేంద్రాల లొకేషన్లు. సమస్యాత్మక - 1*

*రుద్రవరం: 20 గ్రామపంచాయతీలు, 188 వార్డులు, 26 పోలింగ్ కేంద్రాల లొకేషన్లు. సమస్యాత్మక - 10, అత్యంత సమస్యాత్మక - 5*

*శిరివెళ్ల: 13 గ్రామపంచాయతీలు, 127 వార్డులు, 26 పోలింగ్ కేంద్రాల లొకేషన్లు. సమస్యాత్మక - 4 , అత్యంత సమస్యాత్మక - 4*

*ఉయ్యాలవాడ: 10 గ్రామపంచాయతీలు, 74 వార్డులు, 14 పోలింగ్ కేంద్రాల లొకేషన్లు. సమస్యాత్మక - 3*

*నంద్యాల: 17 గ్రామపంచాయతీలు, 158 వార్డులు, 33 పోలింగ్ కేంద్రాల లొకేషన్లు. సమస్యాత్మక - 6, అత్యంత సమస్యాత్మక - 5*

*గోస్పాడు: 13 గ్రామపంచాయతీలు, 118 వార్డులు, 25 పోలింగ్ కేంద్రాల లొకేషన్లు. సమస్యాత్మక - 1, అత్యంత సమస్యాత్మక - 3 ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన పోలీసు బందోబస్తు, నిరంతర పర్యవేక్షణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఎన్నికల సామగ్రి, సిబ్బంది ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని, పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రశాంత నిర్వహణకు అధికారులు, ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*