BREAKING
వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ! ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు! *ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు* పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇండ్లు.. కుటుంబ భవిష్యత్తుకు రూ.5 లక్షల బీమా భరోసా! యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి దీక్ష దివస్ పోస్టర్ ఆవిష్కరణ ఉపాధి పనులలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదు.....… బాల్యవివాహాల నిర్మూలనకు విద్యార్థుల గళం! జగన్ తన కిరాయి రచయితలతో ప్రజాతీర్పును అవమానిస్తున్నారు : టీడీపీ నేత గురజాల మాల్యాద్రి విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ..! - వ్యాపారవేత్త శ్రీనివాస్ గుప్తా.. వర్గల్ నవోదయ ప్రవేశ పరీక్షకు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు మేదినిపూర్లో జీవిత బీమా పథకం ప్రారంభం ఇంటి దొంగతనం కేసును ఛేదించిన ఘట్‌కేసర్ పోలీసులు.. 10 మంది అరెస్ట్‌, మరొకరు పరారీ

ప్రముఖ క్రైస్తవుల సత్కారానికి నామినేషన్లు ఆహ్వానం:జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎం. సుధీర్

Select Suryaa Now
ప్రముఖ క్రైస్తవుల సత్కారానికి నామినేషన్లు ఆహ్వానం:జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎం. సుధీర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించనున్న ప్రముఖ క్రైస్తవుల సత్కారం–2026 కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎం. సుధీర్ తెలిపారు. జిల్లాలోని క్రైస్తవ సంఘ నాయకులు, పాస్టర్లు, చర్చి పెద్దలు, చర్చి కమిటీ సభ్యులు, క్రైస్తవ సంస్థల ప్రతినిధులు ఈ అవకాశాన్ని అర్హులైన వారికి తెలియజేయాలని కోరారు.
సామాజిక సేవ, వైద్యం, విద్య, సాహిత్యం, లలిత కళలు, నాటకరంగం, క్రీడా రంగాల్లో గత పదేళ్లుగా విశేష సేవలు అందించిన వ్యక్తులు వ్యక్తిగత విభాగంలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్యం, విద్య, సామాజిక సేవా రంగాల్లో కనీసం 25 సంవత్సరాలుగా విశేష సేవలందిస్తున్న సంస్థలు కూడా నామినేషన్లు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఎంపికైన ప్రముఖులను క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఘనంగా సత్కరించనున్నట్లు వెల్లడించారు.అభ్యర్థులు నిర్ణీత నమూనాలో నామినేషన్ ఫారంతో పాటు బయోడేటా, సంబంధిత ధ్రువపత్రాలు, సేవలకు సంబంధించిన ఆధారాలను జతచేసి హార్డ్ కాపీ రూపంలో మాత్రమే జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి కార్యాలయం, వికారాబాద్‌లో నేరుగా సమర్పించాలని సూచించారు. వాట్సాప్, ఈమెయిల్ లేదా ఇతర ఆన్‌లైన్ విధానాల్లో పంపిన నామినేషన్లను స్వీకరించబోమని స్పష్టం చేశారు.నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. గడువు ముగిసిన తర్వాత అందిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమన్నారు. జిల్లాలోని అర్హులైన క్రైస్తవులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎం. సుధీర్ కోరారు. మరిన్ని వివరాలకు 040-23391067 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.