BREAKING
*బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ! తేరే నామ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. భోజ్‌పురి సినిమాతో మారిన దశ: రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం కాలుష్య కొరల్లో మల్లి పల్లి చేరువు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ! ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు! *ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు* పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇండ్లు.. కుటుంబ భవిష్యత్తుకు రూ.5 లక్షల బీమా భరోసా! యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి

ఉపాధి పనులలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదు.....…

Select Suryaa Now
ఉపాధి పనులలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదు.....…

మద్దూర్;దూల్మిట్ట మండల కేంద్రంలో బుధవారం ఎంపీడీవో వీర రాజు అధ్యక్షతనంగా సామాజిక తనిఖీ ప్రథమ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 1-4-2025 నుండి 31-3-2026 వరకు గ్రామాలలో చేసిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ బృందం తనిఖీలు నిర్వహించి వాటి వివరాలు ప్రజావేదికలో వెల్లడించారు. ఈ సమావేశానికి అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతూ వివిధ రకాల పనులలో జరిగిన అక్రమాలు తప్పిదాలకు బాధ్యులను చేస్తూ ఉపాధి హామీ సిబ్బందితోపాటు వివిధ స్థాయిలలోని అధికారులకు జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనులలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. మండల వ్యాప్తంగా 91.204 ల జరిమానాలను విధించగా అందులో 34 వేల జరిమాణాలు కేవలం బైరాన్ పల్లి గ్రామంలో జరిగిన పనులకు సంబంధించినవి ఉన్నట్లు తెలిపారు. ప్రజా వేదికకు రెండు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు గైరాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీఓ స్రవంతి, ఏవివో గణేష్, క్యూ సి సంతోష్ రెడ్డి, ఎస్ఆర్పి దేవేందర్, పంచాయతీ కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.