హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుందన్న ఒక్క కారణంతో తాను ఎప్పుడూ సినిమాలను ఎంచుకోనని బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా స్పష్టం చేశారు. తన విలువలు, వ్యక్తిగత నమ్మకాలకు విరుద్ధంగా ఉండే కథలను గతంలో ఎన్నోసార్లు తిరస్కరించానని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా అనారోగ్యకరమైన ప్రేమను ఆకర్షణీయంగా చూపించే కథలకు దూరంగా ఉంటానని, సినీ రంగంలో ప్రతి ప్రేక్షకుడికి తగ్గ సినిమా ఉన్నప్పటికీ తన అంతరాత్మకు నచ్చని ప్రాజెక్టులు చేయనని ఆయుష్మాన్ పేర్కొన్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయుష్మాన్ ఖురానా, సినిమాల్లో టాక్సిక్ ప్రేమను చూపడంపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఎలాంటి టాక్సిక్ లవ్ అయినా సమస్యేనని, అది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. టాక్సిక్‌గా ప్రవర్తించే పాత్రను ఆదర్శప్రాయమైన ప్రేమికుడిగా కాకుండా, ప్రతికూల పాత్రగానే చూపించాలని తాను విశ్వసిస్తానని, ఒక కళాకారుడిగా సరైన సందేశం ఇవ్వడం తన బాధ్యత అని చెప్పారు.
కొన్ని సినిమాలు హిట్ అవుతాయని తెలిసినా వాటిని వద్దనుకున్న సందర్భాలు తన కెరీర్‌లో ఉన్నాయని ఆయుష్మాన్ గుర్తుచేసుకున్నారు. తాను చేసే సినిమాలు తన వ్యక్తిత్వానికి, ఆలోచనలకు దగ్గరగా ఉండాలని, మిగతా నటులు, ప్రేక్షకుల అభిరుచులను గౌరవిస్తూనే తన పంథాలో తాను ముందుకు సాగుతానని తెలిపారు.
ఆయుష్మాన్ ఖురానా, శర్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన యే ప్రేమ్ మోల్ లియా చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. అనుపమ్ ఖేర్, సీమా పహ్వా, సుప్రియా పాఠక్ కపూర్, స్వానంద్ కిర్కిరే వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని రాజ్‌శ్రీ ప్రొడక్షన్స్, మహావీర్ జైన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, హిమేష్ రేషమ్మియా సంగీతం అందిస్తున్నారు.
Also Read: దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ!