*సేవాభావంతో ప్రజల మనసులు గెలుచుకున్న కోహిర్ ఎస్ఐ నరేష్
కోహిర్;ప్రజలకు ఇబ్బంది కలిగితే అది తన సమస్యగా భావించి, పరిష్కారానికి స్వయంగా ముందుకు రావడమే నిజమైన ప్రజాసేవకు నిదర్శనం. ఈ మాటకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు కోహిర్ ఎస్ఐ నరేష్.కోహిర్ ప్రాంతంలో రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ఎస్ఐ నరేష్, ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జేసీబీ సహాయంతో రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చివేయించి వాహనదారులకు ఉపశమనం కల్పించారు.పోలీసు విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తన సేవాభావాన్ని చాటుకున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించిన ఎస్ఐ నరేష్‌పై కోహిర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు.
*ప్రజల భద్రతే కాదు.. ప్రజల సమస్యల పరిష్కారమూ మా బాధ్యతే అని చాటిచెప్పిన ఎస్ఐ నరేష్ సేవాభావం అభినందనీయం!*