BREAKING
రాత్రి కోర్టుల విధానాన్ని వ్యతి రేకిస్తున్నాం వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి.. - కలెక్టర్ కోయ శ్రీహర్ష - మంథని ఆసుపత్రి, గురుకుల పాఠశాల, కళాశాలలో ఆకస్మిక తనిఖీలు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.1,17,200లు విరాళo పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్ క్రిస్మస్ సత్కారాలకు నామినేషన్ల ఆహ్వానం ఈ నెల 30లోగా దరఖాస్తుల సమర్పణ.. - కలెక్టర్ కోయ శ్రీహర్ష ఓటీటీలో 8 ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్.. వాణీ కపూర్ 'మండల మర్డర్స్'పై ఆసక్తి కేజీబీవీ రంపచోడవరంలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ ఆ ఒక్క విషయంలో స్పష్టత ఉంది: నిత్యా మేనన్ ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకోండి 23 ఏళ్ల తర్వాత దర్శకుడు కిరణ్ కర్నీడి రీఎంట్రీ.. ఏఐతో పాన్ ఇండియా చిత్రం స్ట్రైకర్ పోలవరం జిల్లా లో రోడ్డెక్కిన పోలింగ్ సిబ్బంది బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు జలసిరి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి... - ప్రతి గ్రామంలో 60 మంది కూలీలకు తగ్గకుండా పనుల డిమాండ్ తీసుకోవాలి - ఎంపీడీఓ కొప్పుల శ్రీనివాస్ ఆదేశాలు మొదటి విడత గ్రామపంచాయతీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి *భక్తులకు సౌకర్యం కోసం రోడ్డు పని చేయించిన సర్పంచ్*

మొదటి విడత గ్రామపంచాయతీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

Select Suryaa Now
మొదటి విడత గ్రామపంచాయతీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

- కలెక్టర్ దినేష్ కుమార్ 
రంపచోడవరం సూర్య ప్రతినిధి : నేడు పోలవరం జిల్లాలో  మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 
బుధవారం ఉదయం ఆయా మండలాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సిబ్బందిని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.మొదటి విడతలో అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, రాజవొమ్మంగి, రంపచోడవరం మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నామని, పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
మొదటి విడతలో ఐదు మండలాల పరిధిలో మొత్తం 91 గ్రామ పంచాయతీలు, 850 వార్డు సభ్యుల స్థానాలు, 924 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1,35,562 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొండపల్లి (రాజవొమ్మంగి మండలం), వీరవరం (అడ్డతీగల మండలం), జియ్యంపాలెం (గంగవరం మండలం) గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఆయా గ్రామాల్లో అన్ని వార్డు సభ్యుల స్థానాలన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయన్నారు . అదేవిధంగా జగంపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. మొత్తంగా నాలుగు సర్పంచ్ స్థానాలు, 116 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 87 సర్పంచ్ స్థానాలకు 285 మంది అభ్యర్థులు, 734 వార్డు సభ్యుల స్థానాలకు 1,741 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.ఎన్నికల నిర్వహణకు 1,241 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతో పాటు, 121 సున్నితమైన, 41 అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 188 పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ ద్వారా పర్యవేక్షణ, మిగిలిన 736 కేంద్రాల్లో వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించనున్నారు. సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో 41 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మొదటి విడత ఎన్నికల విధుల్లో పాల్గొనే అర్హులైన ఎన్నికల సిబ్బంది, సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఐదు మండలాల పరిధిలో మొత్తం 1,559 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసినట్లు తెలిపారు. ఐదు మండలాల్లో ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే సంబంధిత మండలాలకు చేరవేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును ఎంసీసీ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు , స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. జిల్లా నుంచి మండల స్థాయి వరకు 24 గంటల పాటు కంట్రోల్ రూములు అందుబాటులో ఉంటాయి.ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) జి. భాస్కర్ మాట్లాడుతూ, మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని మండలాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన సౌకర్యాలు కల్పించామని,పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ చేపట్టినట్లు డీపీఓ జి. భాస్కర్ తెలిపారు.ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి అధికారి, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదేశించారు.