BREAKING
అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐ.వి. రోహిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఈఓ లక్ష్మీ శివజ్యోతి రాత్రి కోర్టుల విధానాన్ని వ్యతి రేకిస్తున్నాం వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి.. - కలెక్టర్ కోయ శ్రీహర్ష - మంథని ఆసుపత్రి, గురుకుల పాఠశాల, కళాశాలలో ఆకస్మిక తనిఖీలు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.1,17,200లు విరాళo పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్ క్రిస్మస్ సత్కారాలకు నామినేషన్ల ఆహ్వానం ఈ నెల 30లోగా దరఖాస్తుల సమర్పణ.. - కలెక్టర్ కోయ శ్రీహర్ష ఓటీటీలో 8 ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్.. వాణీ కపూర్ 'మండల మర్డర్స్'పై ఆసక్తి కేజీబీవీ రంపచోడవరంలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ ఆ ఒక్క విషయంలో స్పష్టత ఉంది: నిత్యా మేనన్ ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకోండి 23 ఏళ్ల తర్వాత దర్శకుడు కిరణ్ కర్నీడి రీఎంట్రీ.. ఏఐతో పాన్ ఇండియా చిత్రం స్ట్రైకర్ పోలవరం జిల్లా లో రోడ్డెక్కిన పోలింగ్ సిబ్బంది బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు జలసిరి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి... - ప్రతి గ్రామంలో 60 మంది కూలీలకు తగ్గకుండా పనుల డిమాండ్ తీసుకోవాలి - ఎంపీడీఓ కొప్పుల శ్రీనివాస్ ఆదేశాలు మొదటి విడత గ్రామపంచాయతీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

జలసిరి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి... - ప్రతి గ్రామంలో 60 మంది కూలీలకు తగ్గకుండా పనుల డిమాండ్ తీసుకోవాలి - ఎంపీడీఓ కొప్పుల శ్రీనివాస్ ఆదేశాలు

Select Suryaa Now
జలసిరి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి...  - ప్రతి గ్రామంలో 60 మంది కూలీలకు తగ్గకుండా పనుల డిమాండ్ తీసుకోవాలి - ఎంపీడీఓ కొప్పుల శ్రీనివాస్ ఆదేశాలు

 

సూర్య - పెద్దపల్లి రూరల్ : గ్రామాల్లో చేపడుతున్న జలసిరి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎంపీడీఓ కొప్పుల శ్రీనివాస్ సూచించారు. పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య రాజన్ సూచనల మేరకు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఏపీఓలతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ సోక్‌పిట్స్, కమ్యూనిటీ సోక్‌పిట్స్, బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెన్షన్ ప్రొసీడింగ్స్ అందుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో రేపు సాయంత్రంలోగా నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పశువుల కోసం క్యాటిల్ ట్రాప్స్, నీటి తొట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు గడ్డి సాగు చేసుకునేందుకు కూడా వి.బి.జి. రామ్‌జీ పథకం కింద అవకాశం ఉందని వివరించారు.
అలాగే గ్రామాల్లో వివో భవనాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని, కొత్తగా ఏర్పడిన కుటుంబాల్లో జాబ్ కార్డులు లేని వారికి కూడా నూతన జాబ్ కార్డులు మంజూరు చేయవచ్చని తెలిపారు. ప్రతి గ్రామంలో కనీసం 60 మంది కూలీలు పనులకు వచ్చేలా లేబర్ డిమాండ్ సేకరించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఓ రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.