BREAKING
రాత్రి కోర్టుల విధానాన్ని వ్యతి రేకిస్తున్నాం వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి.. - కలెక్టర్ కోయ శ్రీహర్ష - మంథని ఆసుపత్రి, గురుకుల పాఠశాల, కళాశాలలో ఆకస్మిక తనిఖీలు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.1,17,200లు విరాళo పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్ క్రిస్మస్ సత్కారాలకు నామినేషన్ల ఆహ్వానం ఈ నెల 30లోగా దరఖాస్తుల సమర్పణ.. - కలెక్టర్ కోయ శ్రీహర్ష ఓటీటీలో 8 ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్.. వాణీ కపూర్ 'మండల మర్డర్స్'పై ఆసక్తి కేజీబీవీ రంపచోడవరంలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ ఆ ఒక్క విషయంలో స్పష్టత ఉంది: నిత్యా మేనన్ ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకోండి 23 ఏళ్ల తర్వాత దర్శకుడు కిరణ్ కర్నీడి రీఎంట్రీ.. ఏఐతో పాన్ ఇండియా చిత్రం స్ట్రైకర్ పోలవరం జిల్లా లో రోడ్డెక్కిన పోలింగ్ సిబ్బంది బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు జలసిరి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి... - ప్రతి గ్రామంలో 60 మంది కూలీలకు తగ్గకుండా పనుల డిమాండ్ తీసుకోవాలి - ఎంపీడీఓ కొప్పుల శ్రీనివాస్ ఆదేశాలు మొదటి విడత గ్రామపంచాయతీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి *భక్తులకు సౌకర్యం కోసం రోడ్డు పని చేయించిన సర్పంచ్*

బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు

Select Suryaa Now
బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు

రంపచోడవరం సూర్య ప్రతినిధి : బాల్య వివాహాలను అరికట్టేందుకు ఐసీడీఎస్ అధికారులు చేపడుతున్న చర్యల్లో భాగంగా రంపచోడవరంలో జరగాల్సిన బాల్య వివాహాన్ని అధికారులు ముందస్తుగా గుర్తించి అడ్డుకున్నట్లు. ఈ విషయాన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ఉమ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
రంపచోడవరం పట్టణ పరిధిలోని ఒక వీధికి చెందిన మైనర్ బాలికకు వివాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందిందన్నారు. 
వెంటనే స్పందించిన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ఉమ, సంబంధిత ఐసీడీఎస్ అధికారులు బాలిక ఇంటికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. బాలిక వయస్సు 18 సంవత్సరాలు పూర్తికాకముందే వివాహం నిర్వహించడం చట్టరీత్యా నేరమని ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు  వివరించారు.బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం ఇటువంటి వివాహాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులకు ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, శిక్షల గురించి వివరించి ఇరు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.అధికారులు కల్పించిన అవగాహనకు స్పందించిన ఇరు కుటుంబాల తల్లిదండ్రులు బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం జరిపిస్తామని, ప్రస్తుత వివాహ ఏర్పాట్లను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మరో మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే వివాహం నిర్వహిస్తామని ఇరు కుటుంబాల వారు అంగీకారం తెలిపారు.
బాలికల బాల్యాన్ని కాపాడటంతో పాటు వారి విద్య, భవిష్యత్తుకు భరోసా కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ కె. ఉమ పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని, బాల్య వివాహాల నిర్మూలనలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆమె కోరారు.