కేజీబీవీ రంపచోడవరంలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
రంపచోడవరం. సూర్య ప్రతినిధి : జాతీయ రాజ్యాంగ దినోత్సవం (నేషనల్ కాన్స్టిట్యూషన్ డే) సందర్భంగా రంపచోడవరంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీ సి డి ఓ కె. నాగ శిరీష, మండల విద్యాశాఖ అధికారి మరియు డి. వై. ఈ . ఓ ఆర్.ఎల్ శ్రీనివాసరావు, ఎంఈఓ_2 జీ .సుబ్రహ్మణ్యం హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థినులకు భారత రాజ్యాంగం యొక్క ఆవిర్భావం, ప్రాముఖ్యత, ప్రాథమిక హక్కులు, విధులు, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి గురించి వివరంగా తెలియజేశారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలను పిల్లలు తెలుసుకోవాలని సూచించారు.ఇందులో భాగంగా విద్యార్థినులు భారత రాజ్యాంగానికి సంబంధించి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, రాజ్యాంగ పీఠిక పఠనం వంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రాజ్యాంగంపై తమకున్న అవగాహనను ప్రదర్శించారు.అనంతరం కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థినులను అభినందించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. రాజ్యాంగ స్ఫూర్తిని జీవితంలో అలవర్చుకోవాలని విద్యార్థినులకు సూచించారు.