BREAKING
యే ప్రేమ్ మోల్ లియా' ఆల్బమ్‌కు వంద కోట్ల వ్యూస్.. శ్రేయా ఘోషల్ లైవ్ పాటతో ఆకట్టుకున్న వేడుక కైకేయి పాత్రపై లారా దత్తా ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆశయాలున్న మహిళలను ప్రశ్నించడం ఎందుకు? ప్రజల నమ్మకమే నాయకుడి నిజమైన బలం.. సేవే అసలైన గుర్తింపు! •గతంలో దొడ్డయ్యకు అవకాశం.. ఈసారి మంజుల (దొడ్డయ్య) సర్పంచ్ బరిలో! ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం! వాయు కాలుష్యంతో కిడ్నీలకూ ముప్పు.. పీఎం 2.5 కణాలపై నిపుణుల హెచ్చరిక విటమిన్ బి12 లోపంతో మతిమరుపు సమస్య.. ఈ ఆహారాలతో మెదడుకు కొత్త శక్తి ప్రతి వారం గ్రామసభ… ప్రజల ముందే పంచాయతీ నిర్ణయాలు! చేసిన పని చూసి గెలిపించండి! కడుపులో అల్సర్ లక్షణాలు ఇలా గుర్తించండి.. గ్యాస్ అనుకుని నిర్లక్ష్యం వద్దు గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి మినరల్ వాటర్‌తోనూ ఆరోగ్య ముప్పు.. బ్రోమేట్, పీఏహెచ్‌ఎస్ రసాయనాలపై ఆందోళన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి చీరకట్టులో శోభితా ధూళిపాళ సోయగం.. ఫొటోలు వైరల్ తండ్రీకూతుళ్ల భావోద్వేగాలతో 'డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్'.. నవంబర్ 27న విడుదల బాలల భద్రతకు పోక్సో చట్టం పటిష్ట అమలు ఆర్థిక అక్షరాస్యతపై ఆర్బీఐ అవగాహన సదస్సు

చేసిన పని చూసి గెలిపించండి!

Select Suryaa Now
చేసిన పని చూసి గెలిపించండి!

- రంపచోడవరం స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వై. నిరంజనీ దేవి విజ్ఞప్తి

- రెండుసార్లు సర్పంచ్‌గా, ఒకసారి ఎంపీటీసీగా సేవలందించా
- ఉపాధి హామీ నిధులతో శ్మశానవాటికల అభివృద్ధి
- కరోనా వేళ బాధిత కుటుంబాలకు సొంత ఖర్చుతో సరుకులు
- గెలిస్తే బస్ షెల్టర్లు, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి
- ‘మంచం’ గుర్తుకు ఓటేసి మరోసారి అవకాశం ఇవ్వాలని వినతి

రంపచోడవరం సూర్య ప్రతినిధి : రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేసినప్పుడు రంపచోడవరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రాధాన్యం ఇచ్చానని, ఉపాధి హామీ నిధులతో శ్మశానవాటికలను అభివృద్ధి చేశానని స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వై. నిరంజనీ దేవి చెప్పారు. ఈసారి అవకాశం ఇస్తే ప్రధాన కేంద్రంలో బస్సు కోసం ఎదురుచూసేవారికి షెల్టర్లు, పనిమీద ఊరికి వచ్చేవారికి ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు.

కరోనా వేళ బాధితుల ఇళ్లకే వెళ్లా

కరోనా సమయంలో సొంత ఖర్చుతో నిత్యావసర సరుకులు కొని, బాధితుల ఇళ్లకు వెళ్లి అందించానని నిరంజనీ దేవి గుర్తుచేశారు. వైద్యం అవసరమైన వారికి చికిత్స అందేలా అధికారులతో మాట్లాడానన్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా గ్రామంలో ఎవరికైనా ఆపద వస్తే అండగా నిలిచానని, పార్టీలు, కులమతాలకు అతీతంగా సేవ చేశానని తెలిపారు.

పంచాయతీ పనుల వివరాలు ప్రజలకు చెబుతా

తనను రెండుసార్లు సర్పంచ్‌గా, ఒకసారి ఎంపీటీసీగా గ్రామ ప్రజలు ఎన్నుకున్నారని నిరంజనీ దేవి చెప్పారు. తన భర్త బోసు రంపచోడవరం మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారని తెలిపారు. పేదలకు పింఛన్లు, ఇళ్లు మంజూరయ్యేందుకు, సీసీ రోడ్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు కృషి చేశానన్నారు. గ్రామంలో చేపట్టిన పనులకు గుర్తింపుగా ప్రభుత్వం తనకు ఉత్తమ సర్పంచ్ పురస్కారం ఇచ్చిందని చెప్పారు.

గత అనుభవంతో గ్రామంలో ఏ సదుపాయం ఎక్కడ అవసరమో, ఆ పని కోసం ఏ అధికారిని సంప్రదించాలో తనకు తెలుసని నిరంజనీ దేవి అన్నారు. మరోసారి గెలిపిస్తే పంచాయతీ పనుల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ, అవినీతికి తావులేకుండా పాలన సాగిస్తానన్నారు.

నేడు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్పంచ్ ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పత్రం తొలి వరుసలో తన ‘మంచం’ గుర్తు ఉందని నిరంజనీ దేవి తెలిపారు. గతంలో తాను చేసిన పనులను గుర్తుచేసుకుని మంచం గుర్తుకు ఓటు వేయాలని, రంపచోడవరంలో ఇంకా చేయాల్సిన పనులు పూర్తి చేసేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.