ప్రజల నమ్మకమే నాయకుడి నిజమైన బలం.. సేవే అసలైన గుర్తింపు! •గతంలో దొడ్డయ్యకు అవకాశం.. ఈసారి మంజుల (దొడ్డయ్య) సర్పంచ్ బరిలో! ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం!
పరిగి మండలం యర్రగుంట పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మంజుల (దొడ్డయ్య) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బుధవారం యర్రగుంటలోని ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజలను నేరుగా కలుస్తూ తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరారు.గతంలో ఇదే పంచాయతీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున దొడ్డయ్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి ఎదుర్కొన్నారు. అయినప్పటికీ పార్టీ పట్ల కుటుంబానికి ఉన్న నిబద్ధత రాజకీయ అనుబంధం కొనసాగుతున్నాయి. గతంలో దొడ్డయ్య పార్టీ కోసం చేసిన కృషి పార్టీ కార్యక్రమాల్లో చూపిన చురుకుదనాన్ని పరిగణనలోకి తీసుకుని పెనుకొండ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఈసారి మంజుల (దొడ్డయ్య)కు పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు.
గత అనుభవం.. ఈసారి కొత్త అభ్యర్థితో ప్రజాక్షేత్రంలోకి!
గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి మంజుల (దొడ్డయ్య) ప్రజల ముందుకు వస్తున్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు గ్రామస్తుల ఆదరాభిమానాలను పొందేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు. కుటుంబానికి ఉన్న రాజకీయ అనుబంధాన్ని కొనసాగిస్తూ తనదైన గుర్తింపుతో ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.గ్రామంలోని పెద్దలు యువత మహిళలు వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతున్నారు. గ్రామస్తుల ఆదరాభిమానాలతో ఈసారి విజయం సాధించాలనే ఆశాభావంతో మంజుల (దొడ్డయ్య) ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. మహిళా అభ్యర్థిగా ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.
పరిగి సూర్య రిపోర్ట్ నవీన్…