BREAKING
యే ప్రేమ్ మోల్ లియా' ఆల్బమ్‌కు వంద కోట్ల వ్యూస్.. శ్రేయా ఘోషల్ లైవ్ పాటతో ఆకట్టుకున్న వేడుక కైకేయి పాత్రపై లారా దత్తా ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆశయాలున్న మహిళలను ప్రశ్నించడం ఎందుకు? ప్రజల నమ్మకమే నాయకుడి నిజమైన బలం.. సేవే అసలైన గుర్తింపు! •గతంలో దొడ్డయ్యకు అవకాశం.. ఈసారి మంజుల (దొడ్డయ్య) సర్పంచ్ బరిలో! ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం! వాయు కాలుష్యంతో కిడ్నీలకూ ముప్పు.. పీఎం 2.5 కణాలపై నిపుణుల హెచ్చరిక విటమిన్ బి12 లోపంతో మతిమరుపు సమస్య.. ఈ ఆహారాలతో మెదడుకు కొత్త శక్తి ప్రతి వారం గ్రామసభ… ప్రజల ముందే పంచాయతీ నిర్ణయాలు! చేసిన పని చూసి గెలిపించండి! కడుపులో అల్సర్ లక్షణాలు ఇలా గుర్తించండి.. గ్యాస్ అనుకుని నిర్లక్ష్యం వద్దు గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి మినరల్ వాటర్‌తోనూ ఆరోగ్య ముప్పు.. బ్రోమేట్, పీఏహెచ్‌ఎస్ రసాయనాలపై ఆందోళన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి చీరకట్టులో శోభితా ధూళిపాళ సోయగం.. ఫొటోలు వైరల్ తండ్రీకూతుళ్ల భావోద్వేగాలతో 'డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్'.. నవంబర్ 27న విడుదల బాలల భద్రతకు పోక్సో చట్టం పటిష్ట అమలు ఆర్థిక అక్షరాస్యతపై ఆర్బీఐ అవగాహన సదస్సు

గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి

Select Suryaa Now
గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి

- రోడ్ల మరమ్మతులు, ఘాట్‌ల అభివృద్ధి, ట్రాఫిక్ మళ్లింపులు, బారికేడింగ్, తాగునీరు,పారిశుద్ధ్య ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.

- అందుబాటులో ఉన్న నిధులను అత్యవసర పనులకు మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో వినియోగించాలి.

- రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్.

కాకినాడ, మేజర్ న్యూస్ : గోదావరి పుష్కరాల నిర్వహణకుఅందుబాటులో ఉన్న నిధులను అత్యవసర పనులకు మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో వినియో గించాలనీ ఆర్థిక శాఖ  కార్యదర్శి పీయూష్ కుమార్ వివిధ శాఖల అధికారులకు కలెక్టర్లకు స్పష్టం చేశారు.

మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, ఘాట్‌ల వద్ద ఏర్పాట్లు, రవాణా, భద్రత, తాగు నీరు, పారిశుద్ధ్య సదుపాయాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, పుష్కరాల ప్రత్యేక అధికారి ఎస్. సురేష్ కుమార్ వివిధ శాఖల కార్యదర్శులు కలెక్టర్లతో కలిసి వివిధ శాఖలు అదనంగా ప్రతిపాదించిన నిధుల నివేదికలపై బుధవారం అమరావతి నుంచి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిం చారు..

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ,తూర్పు గోదావరి, కోనసీమ పోలవరం ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్ల పాల్గొనగా. స్థానిక కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్  హాజరయ్యారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్  జిల్లా స్థాయి అధికారులతో  వివిధ శాఖలు పుష్కరాలు నిర్వహణపై అదనంగా ప్రతిపాదించిన నిధులు పై సమీక్షించారు..

ఈ సందర్భంగా  జేసి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో ప్రతిపాదిత ఘాట్‌ల వద్ద అభివృద్ధి పనులను మెరుగ్గా చేపట్టాలని, భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని  ఆదేశించారు ఇప్పటికే ఉన్న బీటీ రోడ్ల మరమ్మతులు, రోడ్ల వెడల్పు,, శిథిలావస్థకు చేరిన వంతెనల నిర్మా ణం, మర మ్మతులకు సంబంధించిన ప్రతిపా దనలపై సమీక్షించారు భవిష్యత్తులో చేపట్టాల్సి న రహదారి పనులను కూడా పరిశీలించి, అవసరమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

ట్రాఫిక్ మళ్లింపులు, బారికేడింగ్ ఏర్పాట్లు

గోదావరి పరివాహక ప్రాంతంలోని వివిధ ఘాట్‌లకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున, ప్రతి ఘాట్‌కు వెళ్లే యాక్సెస్ రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిం చారు. పోలీసు శాఖ సిఫార్సుల మేరకు, ట్రాఫిక్ రద్దీని నియం త్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ డైవర్షన్లు, బారికేడింగ్, ప్రవేశ మార్గాల నియంత్రణపై కార్యాచరణ రూపొందించాలన్నారు

గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పీక్ సమ యాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా వివిధ రహదారులపై వాహనాల రాకపోకలను అంచనా వేసి ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాలని సూచించారు., కోస్టల్ కారిడార్, జాతీయ రహదారుల పరిస్థితులు, భక్తుల రాకపోకలపై మ్యాప్‌ల నివేదికలు ఆధారంగా సమీక్షించారు.

పుష్కరాల ఏర్పాట్లలో అందుబాటులో ఉన్న నిధుల పరిమితులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో  పనులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. కొత్త రహదారుల నిర్మాణం కంటే ఇప్పటికే ఉన్న రహదారుల మరమ్మతులు, వెడల్పు పనులు, ట్రాఫిక్ మళ్లిం పులకు అవసరమైన మార్గాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న  బారికేడింగ్‌ను వినియోగిం చుకుంటూ మిగిలిన అవస రాలను తక్కువ వ్యయంతో సమకూర్చుకునే మార్గాలను పరిశీలించాలని తెలిపారు.

పుష్కరాలకు భక్తుల రాకపోకలు పెరిగే అవకాశం ఉన్నందున ఏపీఎస్‌ఆర్టీసీ ఆధ్వ ర్యంలో బస్సుల నిర్వ హణ, తాత్కాలిక బస్ స్టేషన్ల ఏర్పాటు, అవసరమైన మరమ్మ తులపై కార్యాచరణ రూపొందించాలని భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య, రవాణా సదుపాయాలు, ఆర్థిక అవసరాలను అంచనా వేయా లని సూచించారు.

పుష్కరాల సమయంలో భక్తులకు నిరంతర తాగు నీటి సరఫరా కల్పించేం దుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. తాత్కాలిక మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి పుష్కరాల సమయంలో అవసర మైన ఏర్పాట్లు చేయా లన్నారు. పుష్కర నగరాలు, పార్కింగ్ ప్రాంతాలు, అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కర్ నగరులు ఏర్పాటు చేసే చోట వద్ద భక్తులకు అవసరమైన వసతులను వివిధ శాఖల సమన్వయంతో కల్పించా లన్నారు. పర్యాటక శాఖలో ఇంజినీరింగ్ సిబ్బంది పరిమితంగా ఉన్నందున రహదారులు, నీటి పారుదల, పంచా యతీ రాజ్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల సహ కారంతో పనులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పనుల పర్య వేక్షణకు ప్రత్యేక అధి కారులను నియ మించడం, అవసరమైన నిధులు కేటాయించడం, పుష్కరాల 12 రోజుల నిర్వహణ అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నా రు

నిధుల వినియోగంపై స్పష్టమైన కార్యాచరణ.

బారికేడింగ్, విద్యుత్ బస్సులు, ఛార్జింగ్ స్టేషన్లు, రహదారుల మరమ్మతులు, నిర్మాణ పనులకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. అందు బాటులో ఉన్న నిధుల పరిమితులను దృష్టిలో ఉంచుకుని అత్యవసర మైన, భక్తుల భద్రతకు, రవాణా సౌకర్యాలకు నేరుగా ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సాధ్యమైనంత వరకు అవసరమైన సామగ్రి, ఇతర ఏర్పాట్లను స్థానిక వనరుల ద్వారా సమ కూర్చుకోవాలని సూచిం చారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పి సీఈఓ లక్ష్మణ రావు , డి ఎం అండ్ హెచ్ ఓ :కే అనిత, డిసిహె చ్ఎస్ డాక్టర్ మహేశ్వర రావు ఆర్ అండ్ బి, పంచాయ తీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, జల వనరుల శాఖ ఇంజనీర్లు అటవీశాఖ అధికారులు తది తరులు పాల్గొ న్నారు.