పోలింగ్ ఎన్నికల సామాగ్రి పంపిణీ
సామర్లకోట, మేజర్ న్యూస్ : సామర్లకోట మండలం లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని సామర్లకోట టీటీడీసి కార్యాలయంలో చేపట్టారు.ఉదయం నుండి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది టీటీడీసీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా ఎన్నికల ప్రిసైటింగ్ అధికారులు ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించడం జరుగుతుంది.సామర్లకోట మండల పరిధిలో 18 గ్రామ పంచాయతీలకు గాను బోయినపూడి పంచాయితీ ఏకగ్రీవం కావడంతో 17 గ్రామాల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించు కొనేందుకు 218 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.మధ్యాహ్నం 12 గంటల అనంతరం ఎన్నికల సామాగ్రితో కలిసి పోలింగ్ అధికారులు ఎన్నికలు జరగనున్న ఆయా గ్రామాలకు బయలుదేరి వెళ్లడం జరుగుతుందని,గురువారం ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.అనంతరం ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలువెల్లడించనున్నారు.