అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐ.వి. రోహిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఈఓ లక్ష్మీ శివజ్యోతి
అన్నవరం, మేజర్ న్యూస్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిణిగా (ఈఓ) బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి లక్ష్మీ శివజ్యోతి, అనంతరం దేవస్థానం చైర్మన్ ఐ.వి. రోహిత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చైర్మన్ ఐ.వి. రోహిత్‌తో దేవస్థానానికి సంబంధించిన పలు అంశాలపై మర్యాదపూర్వకంగా మాట్లాడారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చైర్మన్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
దేవస్థానo అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది.