BREAKING
ప్రతి వారం గ్రామసభ… ప్రజల ముందే పంచాయతీ నిర్ణయాలు! చేసిన పని చూసి గెలిపించండి! కడుపులో అల్సర్ లక్షణాలు ఇలా గుర్తించండి.. గ్యాస్ అనుకుని నిర్లక్ష్యం వద్దు గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి మినరల్ వాటర్‌తోనూ ఆరోగ్య ముప్పు.. బ్రోమేట్, పీఏహెచ్‌ఎస్ రసాయనాలపై ఆందోళన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి చీరకట్టులో శోభితా ధూళిపాళ సోయగం.. ఫొటోలు వైరల్ తండ్రీకూతుళ్ల భావోద్వేగాలతో 'డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్'.. నవంబర్ 27న విడుదల బాలల భద్రతకు పోక్సో చట్టం పటిష్ట అమలు ఆర్థిక అక్షరాస్యతపై ఆర్బీఐ అవగాహన సదస్సు మున్సిపల్ చైర్మన్ పిట్టా ను కలిసిన మెప్మా సిబ్బంది సినీ రంగంలో మహిళల సత్తా.. అవకాశాలు పెరుగుతున్నాయన్న స్వప్న దత్ పోలింగ్ ఎన్నికల సామాగ్రి పంపిణీ సంబరాల ఏటిగట్టు సంక్రాంతి విడుదలపై సందేహాలు.. ప్రమోషన్ల వేగం ఎక్కడ? అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐ.వి. రోహిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఈఓ లక్ష్మీ శివజ్యోతి

పోలవరం జిల్లా లో రోడ్డెక్కిన పోలింగ్ సిబ్బంది

Select Suryaa Now
పోలవరం జిల్లా లో రోడ్డెక్కిన పోలింగ్ సిబ్బంది

- ఖాళీ కంచాలతో పోలింగ్ సిబ్బంది ఆందోళన
రంపచోడవరం, సూర్య ప్రతినిధి : పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి భోజనాల ఏర్పాటులో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి...ఎన్నికల విధులకు హాజరైయెందుకు డిస్టిబ్యూషన్ కేంద్రానికి వచ్చిన సిబ్బందికి సరిపడా భోజనం అందకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి విధులు  కు హాజరుయ్యేందుకు వచ్చిన సిబ్బందికి మధ్యాహ్న  ఏర్పాటు చేసిన ఆహారం సరిపోకపోవడంతో పలువురు సిబ్బంది భోజనం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి వేచి చూసినా భోజనం అందకపోవడంతో సిబ్బంది తీవ్ర అసహనం కి గురయ్యారు.
దీంతో కొంతమంది ఎన్నికల సిబ్బంది ఖాళీ కంచాలను చేతబట్టి కలెక్టరేట్ ఎదుటకు చేరుకుని ధర్నాకు దిగారు. ఎన్నికల విధుల్లో తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఎన్నికల విధులకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బందికి భోజనాలు కూడా సక్రమంగా అందించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి   నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల నిర్వహణలో కీలకంగా పనిచేసే పోలింగ్ సిబ్బందికి ముందస్తు ప్రణాళికతో భోజన సదుపాయాలు కల్పించాల్సి ఉండగా, సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా ఆహారం సిద్ధం చేయకపోవడంపై వారు మండిపడ్డారు. తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఖాళీ కంచాలతో నిరసన చేపట్టినట్లు తెలిపారు.
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి కనీస అవసరాల విషయంలోనూ ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టర్ దినేష్ కుమార్  తరచూ సమీక్ష సమావేశాలు జరుగుతున్న క్రింది  స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది.