క్రిస్మస్ సత్కారాలకు నామినేషన్ల ఆహ్వానం ఈ నెల 30లోగా దరఖాస్తుల సమర్పణ.. - కలెక్టర్ కోయ శ్రీహర్ష
సూర్య – పెద్దపల్లి: క్రిస్మస్ పండుగ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన క్రైస్తవ వ్యక్తులు, సంస్థలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈ మేరకు అర్హుల నుంచి నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు బుధవారం వెల్లడించారు.
సామాజిక, వైద్య, విద్య, సాహిత్యం, కళలు, క్రీడా రంగాల్లో పదేళ్లకు పైగా సేవలందించిన వ్యక్తులు, వైద్య, విద్య, సామాజిక రంగాల్లో 25 ఏళ్లకు పైగా సేవలందించిన సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నామినేషన్ ఫారాలను www.tgcmfc.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 30న సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. వివరాలకు 040-23391067 నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.