BREAKING
ప్రతి వారం గ్రామసభ… ప్రజల ముందే పంచాయతీ నిర్ణయాలు! చేసిన పని చూసి గెలిపించండి! కడుపులో అల్సర్ లక్షణాలు ఇలా గుర్తించండి.. గ్యాస్ అనుకుని నిర్లక్ష్యం వద్దు గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి మినరల్ వాటర్‌తోనూ ఆరోగ్య ముప్పు.. బ్రోమేట్, పీఏహెచ్‌ఎస్ రసాయనాలపై ఆందోళన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి చీరకట్టులో శోభితా ధూళిపాళ సోయగం.. ఫొటోలు వైరల్ తండ్రీకూతుళ్ల భావోద్వేగాలతో 'డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్'.. నవంబర్ 27న విడుదల బాలల భద్రతకు పోక్సో చట్టం పటిష్ట అమలు ఆర్థిక అక్షరాస్యతపై ఆర్బీఐ అవగాహన సదస్సు మున్సిపల్ చైర్మన్ పిట్టా ను కలిసిన మెప్మా సిబ్బంది సినీ రంగంలో మహిళల సత్తా.. అవకాశాలు పెరుగుతున్నాయన్న స్వప్న దత్ పోలింగ్ ఎన్నికల సామాగ్రి పంపిణీ సంబరాల ఏటిగట్టు సంక్రాంతి విడుదలపై సందేహాలు.. ప్రమోషన్ల వేగం ఎక్కడ? అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐ.వి. రోహిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఈఓ లక్ష్మీ శివజ్యోతి

ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకోండి

Select Suryaa Now
ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకోండి

- జిల్లా ఎస్పీ కే. చక్రవర్తి
రంపచోడవరం సూర్య ప్రతినిధి : పోలవరం జిల్లా ఎస్పీ కే. చక్రవర్తి  నేడు జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా ప్రజలకు, ఓటర్లకు, అభ్యర్థులకు, రాజకీయ నాయకులకు పలు సూచనలు చేశారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ నాయకులు తమ అనుచరులకు తగిన సూచనలు చేస్తూ గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సంయమనం పాటించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, బ్యాలెట్ బాక్సుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేయడం, అపహరించడం లేదా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.గ్రామ ప్రజలందరూ పోలీస్ , ఎన్నికల అధికారులకు సహకరిస్తూ ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ కోరారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత ఓటింగ్, ప్రజల భద్రత, ప్రశాంత ఎన్నికల నిర్వహణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ తెలిపారు.