BREAKING
ప్రతి వారం గ్రామసభ… ప్రజల ముందే పంచాయతీ నిర్ణయాలు! చేసిన పని చూసి గెలిపించండి! కడుపులో అల్సర్ లక్షణాలు ఇలా గుర్తించండి.. గ్యాస్ అనుకుని నిర్లక్ష్యం వద్దు గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి మినరల్ వాటర్‌తోనూ ఆరోగ్య ముప్పు.. బ్రోమేట్, పీఏహెచ్‌ఎస్ రసాయనాలపై ఆందోళన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి చీరకట్టులో శోభితా ధూళిపాళ సోయగం.. ఫొటోలు వైరల్ తండ్రీకూతుళ్ల భావోద్వేగాలతో 'డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్'.. నవంబర్ 27న విడుదల బాలల భద్రతకు పోక్సో చట్టం పటిష్ట అమలు ఆర్థిక అక్షరాస్యతపై ఆర్బీఐ అవగాహన సదస్సు మున్సిపల్ చైర్మన్ పిట్టా ను కలిసిన మెప్మా సిబ్బంది సినీ రంగంలో మహిళల సత్తా.. అవకాశాలు పెరుగుతున్నాయన్న స్వప్న దత్ పోలింగ్ ఎన్నికల సామాగ్రి పంపిణీ సంబరాల ఏటిగట్టు సంక్రాంతి విడుదలపై సందేహాలు.. ప్రమోషన్ల వేగం ఎక్కడ? అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐ.వి. రోహిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఈఓ లక్ష్మీ శివజ్యోతి

రాత్రి కోర్టుల విధానాన్ని వ్యతి రేకిస్తున్నాం

Select Suryaa Now
రాత్రి కోర్టుల విధానాన్ని వ్యతి రేకిస్తున్నాం

-  ఖాళీగా ఉన్న న్యాయాధికారుల పోస్టులు భర్తీ చేయాలి

- శనివారం వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగింపు
- పిఠాపురం బార్ అసోసియేషన్ న్యాయవాదులు

పిఠాపురం, మేజర్ న్యూస్ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదిస్తున్న సాయంత్రం, రాత్రి కోర్టుల విధానం కక్షిదారులకు, న్యాయవాదులకు ఆమోదయోగ్యం కాదని పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల రవి, కార్యదర్శి కొంగు నూకరాజు స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల అనేక సమస్యలు, అనర్థాలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర న్యాయశాఖ ప్రతిపాదించిన సాయంత్రం, రాత్రి కోర్టుల విధానాన్ని వ్యతిరేకిస్తూ పిఠాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. పట్టణంలోని నాలుగు కోర్టుల్లోనూ న్యాయవాదులు న్యాయపరమైన కార్యకలాపాలకు హాజరుకాకుండా నిరసన తెలిపారు. జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాలను శనివారం వరకు కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే పగటిపూట కోర్టు విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులకు సాయంత్రం, రాత్రి వేళల్లో విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. పని వేళలను పొడిగించి రాత్రి వరకు కోర్టులు నిర్వహించడం వల్ల న్యాయవాదులపై అదనపు పనిభారం పడటంతో పాటు వారి వ్యక్తిగత, కుటుంబ జీవితంపై ప్రభావం పడుతుందని తెలిపారు. కోర్టు కార్యకలాపాలు ముగించుకుని రాత్రి వేళల్లో ఇళ్లకు తిరిగి వెళ్లే న్యాయవాదులు, కక్షిదారుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
కోర్టుల్లో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించాలంటే సాయంత్రం, రాత్రి కోర్టుల ఏర్పాటు పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న న్యాయాధికారుల పోస్టులను తక్షణమే భర్తీ చేయడంతో పాటు, అవసరమైన అదనపు న్యాయాధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. సాయంత్రం, రాత్రి కోర్టుల విధానాన్ని పిఠాపురం బార్ అసోసియేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల రవి, కార్యదర్శి కొంగు నూకరాజు, జాయింట్ సెక్రటరీ మూర్తి, కోశాధికారి కె. రాజేశ్వరి, లేడీ రిప్రజెంటేటివ్ ఎం. సత్యవతి, ఈసీ సభ్యుడు సరిదే నాగేశ్వరరావు, సీనియర్ న్యాయవాదులు ఎం. రాజారావు, ఏకేవీ రెడ్డి, పి. రాజు, డి. రమేష్ బాబు, వర్మ, జీఎస్ భాస్కరాచార్యులు, బి. వెంకటలక్ష్మి, డి. లక్ష్మి, బి. విజయలక్ష్మి, పి. భవాని తదితరులు పాల్గొన్నారు.