శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.1,17,200లు విరాళo
అన్నవరం, మేజర్ న్యూస్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల ఆకలి తీర్చేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి విజయవాడకు చెందిన అహులూరి నవ్య శ్రీ రూ.1,17,200 (ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల రూపాయలు) విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా దాత అహులూరి నవ్య శ్రీ దేవస్థాన అధికారులకు విరాళం మొత్తాన్ని అందజేశారు. తాను అందజేసిన విరాళంపై వచ్చే వడ్డీతో జూన్ 14వ తేదీన తన పేరు మీద నిత్య అన్నదాన పథకం ద్వారా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించాలని దేవస్థాన అధికారులను కోరారు.
శ్రీ సత్యదేవుని సన్నిధిలో భక్తులకు అన్నప్రసాదం అందించాలనే సదుద్దేశంతో దాత అందించిన ఈ విరాళం పట్ల దేవస్థాన అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దాతకు శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేసి స్వామివారి ఆశీస్సులు అందించారు.