నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బైరి చెన్నయ్య ముమ్మర ప్రచారం
ఓటేసి గెలిపిస్తే... గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటా - సర్పంచ్ అభ్యర్థి బైరి చెన్నయ్య
- మంచం గుర్తుపై ఓటు వేయాలంటూ ముమ్మర ప్రచారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : గ్రామ అభివృద్ధిని ఆశించి:నమ్మకంతో మంచం గుర్తుపై ఓటేసి గెలిపిస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ రుణం తీర్చుకుంటానని సర్పంచ్ అభ్యర్థి బైరి చెన్నయ్య అన్నారు. బుధవారం మండలంలోని శ్రీపతిరావు పేట గ్రామంలో మంచం గుర్తుపై ఓటేసి గెలిపించాలంటూ టిడిపి నాయకులు వసంత కుమార్, సుబ్బారెడ్డి, నాగర్జున, చంద్రారెడ్డి, వెంకటరమణ, రమేష్, ముర్తుజావలి, ఎంపిటిసి శేష శంకర్ ల ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిని ఆశిస్తే నమ్మకంతో ఓటేసి గెలిపించాలని అభివృద్ధి సేవతో గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రచారంలో ముందుకు సాగారు. గ్రామంలోని ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పిస్తూ ప్రజలకు ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.