BREAKING
అన్నవరం దేవస్థానం తొలి మహిళా ఈఓగా లక్ష్మీ శివజ్యోతి బాధ్యతల స్వీకరణ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బైరి చెన్నయ్య ముమ్మర ప్రచారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ చేసిన సర్పంచ్ అశ్విని సంగమేశ్వర్ పాటిల్, ఆస్కార్ అవకాశం చేజారినా బాధ లేదు.. గోంధల్‌పై శర్వరీ ప్రశంసల వర్షం! ఆస్కార్ అవకాశం చేజారినా బాధ లేదు.. గోంధల్‌పై శర్వరీ ప్రశంసల వర్షం! *బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ! తేరే నామ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. భోజ్‌పురి సినిమాతో మారిన దశ: రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం కాలుష్య కొరల్లో మల్లి పల్లి చేరువు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య

దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ!

Select Suryaa Now
దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఒకవైపు భారత్‌లో పాకిస్థానీ నటీనటులు, షోలపై నిషేధం విధించాలంటూ తీవ్ర స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్న వేళ, బాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ యో యో హనీ సింగ్ మరియు పాకిస్థానీ గాయకుడు అతీఫ్ అస్లాం కలిసి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. దుబాయ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో వీరిద్దరూ ఒకే వేదికపై ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ వేడుకలో అతీఫ్ అస్లాం తన హిట్ పాటలను ఆలపిస్తుండగా, పక్కనే ఉన్న హనీ సింగ్ ఉత్సాహంగా స్టెప్పులేస్తూ కనిపించారు.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న పాకిస్థానీ షోలు జో బచే హై సంగ సమేత్ లో, దర్-ఎ-నిజాత్ వంటి ప్రాజెక్టులపై భారతీయ సినీ కార్మిక సంఘాలు, నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ తదితరులు నటించిన ఈ షోలను భారత్‌లో స్ట్రీమింగ్ చేయకూడదని, పాకిస్థానీ కళాకారుల కంటెంట్‌పై పూర్తి నిషేధం కొనసాగించాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. సరిగ్గా ఇలాంటి సున్నితమైన సమయంలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం కలిసి సందడి చేయడం పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వీడియో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు హనీ సింగ్ తీరుపై విమర్శలు గుప్పిస్తుండగా, మరికొందరు సంగీతానికి సరిహద్దులు లేవంటూ మద్దతుగా నిలుస్తున్నారు. గతంలోనూ భారత సినీ పరిశ్రమలో పాకిస్థానీ గాయకులు, నటుల భాగస్వామ్యంపై పలుమార్లు వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంతో మరోసారి ఆ అంశం తెరపైకి వచ్చింది.

మరోవైపు ఈ వివాదంపై హనీ సింగ్ గానీ, అతీఫ్ అస్లాం గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే దుబాయ్ వేడుకకు సంబంధించిన ఈ వీడియో క్లిప్స్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతూ నెటిజన్ల మధ్య వాడివేడి చర్చకు దారితీస్తున్నాయి.