BREAKING
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బైరి చెన్నయ్య ముమ్మర ప్రచారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ చేసిన సర్పంచ్ అశ్విని సంగమేశ్వర్ పాటిల్, ఆస్కార్ అవకాశం చేజారినా బాధ లేదు.. గోంధల్‌పై శర్వరీ ప్రశంసల వర్షం! ఆస్కార్ అవకాశం చేజారినా బాధ లేదు.. గోంధల్‌పై శర్వరీ ప్రశంసల వర్షం! *బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ! తేరే నామ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. భోజ్‌పురి సినిమాతో మారిన దశ: రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం కాలుష్య కొరల్లో మల్లి పల్లి చేరువు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ!

న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం

Select Suryaa Now
న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం

న్యాల్‌కల్;న్యాల్‌కల్ మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. న్యాల్‌కల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్తపల్లి భాస్కర్ రెడ్డి గారు చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి, సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్, ఉప సర్పంచ్ సరోజ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రేషన్ డీలర్ జమీల్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొత్తపల్లి భాస్కర్ రెడ్డి  మాట్లాడుతూ - "ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే మా లక్ష్యం. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు సక్రమంగా అందుతాయి. ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకే తీసుకెళ్తాం" అని అన్నారు.కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్డులు అందడంతో ఇకపై రేషన్ తీసుకోవడం సులభమవుతుందని వారు తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.