కాలుష్య కొరల్లో మల్లి పల్లి చేరువు
కొండాపూర్;మల్లేపల్లి శివారులోని మద్యం, టైర్ల పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య వ్యర్థాలు స్థానిక ప్రజలకు, రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సుమారు 40 పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు కాలువలు, వాగుల ద్వారా మల్లేపల్లి చెరువులోకి చేరుతున్నాయి కొన్నేళ్లుగా రైతులు పరిశ్రమల యాజమాన్యాల వద్ద ధర్నాలు చేసినా, గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్రికల్లో కథనాలు, ప్రజావాణిలో ఫిర్యాదులు చేసినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్పందించడం లేదని విమర్శిస్తున్నారు.కాలుష్య నీటితో చెరువులోని చెట్లు ఎండిపోతుండగా, సమీపంలోని చెర్ల గోపులారం గ్రామంలో తాగునీటి బోర్లు కలుషితమవుతున్నాయి దోమలు, విషపూరిత పురుగుల బెడద పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశ్రమలపై తనిఖీలు నిర్వహించి, వ్యర్థ జలాలు చెరువులు, వాగుల్లోకి చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని.. గ్రామాల ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.