*ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు*
కోహెడ;ఈరోజు గుండారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ పిల్లి బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, వార్డు సభ్యులు కడ్తాల నరేందర్ రెడ్డి, బొమ్మెడ పుష్పలత, మాజీ సర్పంచ్ సుతారి కనుకరాజు, జాప రాజిరెడ్డి, అంగన్వాడీ టీచర్లు వంగ ఉమాదేవి, ఓరుగంటి నిర్మల, ఆశా వర్కర్లు గుడిపాక రేణుక, గుజ్జు జోత్స్న మరియు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే లక్ష్యంగా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.