BREAKING
*బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ! తేరే నామ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. భోజ్‌పురి సినిమాతో మారిన దశ: రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం కాలుష్య కొరల్లో మల్లి పల్లి చేరువు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ! ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు! *ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు* పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇండ్లు.. కుటుంబ భవిష్యత్తుకు రూ.5 లక్షల బీమా భరోసా! యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి

యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి

Select Suryaa Now
యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి

సిద్దిపేట;యాసంగి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వెల్లడించి రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు రామలింగా రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.యాసంగి, రబీ సాగుపై జిల్లా రైతులు అనేక సందేహాలతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతుల సందేహాలను నివృత్తి చేసి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరువు ప్రభావిత మండలాల రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతమేర ఉందో వెల్లడించాలని కోరారు. రైతులకు రోజుకు ఎన్ని గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. రాబోయే యాసంగి సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలియజేయాలని డిమాండ్ చేశారు.రైతులకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి సాగుపై భరోసా కల్పించాలని కోరారు. యాసంగి రైతు భరోసా ఎప్పుడూ ఇస్తారు అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.  అదేవిధంగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ భీమా పథకంపై స్పష్టత లేదని పేర్కొంటూ, ప్రస్తుతం అమలులో ఉన్న రైతు బీమా పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.  రైతు బీమా గడువు ముగిసిన తర్వాత చని పోయిన రైతు కుటుంబాలకు వెంటనే భీమా పరిహారం తో సమానంగా పరిహారం అందియ్యాలన్నారు.ఈ సమావేశంలో ఐ లేని మల్లికార్జున రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, ఏవీ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.