BREAKING
*బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ! తేరే నామ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. భోజ్‌పురి సినిమాతో మారిన దశ: రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం కాలుష్య కొరల్లో మల్లి పల్లి చేరువు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ! ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు! *ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు* పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇండ్లు.. కుటుంబ భవిష్యత్తుకు రూ.5 లక్షల బీమా భరోసా! యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి

వర్గల్ నవోదయ ప్రవేశ పరీక్షకు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు

Select Suryaa Now
వర్గల్ నవోదయ ప్రవేశ పరీక్షకు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు

వర్గల్ ;పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, వర్గల్‌లో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న నవోదయ విద్యాలయ ప్రవేశ ఎంపిక పరీక్ష–2027 ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయని విద్యాలయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరో తరగతిలో మొత్తం 80 సీట్ల భర్తీ కోసం ఈ నెల 28వ తేదీ శనివారం ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రవేశ ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంపిక చేసిన 25 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలు ఇలా.. సిద్ధిపేట జిల్లాలో 11 పరీక్ష కేంద్రాలు.మెదక్ జిల్లాలో 6 పరీక్ష కేంద్రాలు,. సంగారెడ్డి జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలు.మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ వివరించారు. ఈ పరీక్షకు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మొత్తం 5,148 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు.

పరీక్ష సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..

ప్రవేశ పరీక్ష నిర్వహణలో భాగంగా సెంటర్ సూపరింటెండెంట్లు, సెంటర్ లెవల్ అబ్జర్వర్లుగా నియమితులైన సిబ్బందికి నవంబర్ 26వ తేదీ గురువారం మూడు జిల్లాల ప్రధాన కేంద్రాల్లో జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.పరీక్షను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలు, ఇతర కీలక అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు సిబ్బందికి తగిన సూచనలు చేయనున్నట్లు వెల్లడించారు.

అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు..

నవోదయ ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదలైనప్పటి నుంచి వివిధ దశల్లో విద్యాలయానికి సహకరిస్తూ, అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్న మూడు జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, వారి సిబ్బందికి నవోదయ విద్యాలయ సమితి తరఫున ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అన్ని శాఖల సమన్వయంతో ప్రవేశ ఎంపిక పరీక్ష–2027 విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పరీక్ష ప్రశాంతంగా, సజావుగా పూర్తవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.