BREAKING
వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ! ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు! *ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు* పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇండ్లు.. కుటుంబ భవిష్యత్తుకు రూ.5 లక్షల బీమా భరోసా! యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి దీక్ష దివస్ పోస్టర్ ఆవిష్కరణ ఉపాధి పనులలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదు.....… బాల్యవివాహాల నిర్మూలనకు విద్యార్థుల గళం! జగన్ తన కిరాయి రచయితలతో ప్రజాతీర్పును అవమానిస్తున్నారు : టీడీపీ నేత గురజాల మాల్యాద్రి విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ..! - వ్యాపారవేత్త శ్రీనివాస్ గుప్తా.. వర్గల్ నవోదయ ప్రవేశ పరీక్షకు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు మేదినిపూర్లో జీవిత బీమా పథకం ప్రారంభం ఇంటి దొంగతనం కేసును ఛేదించిన ఘట్‌కేసర్ పోలీసులు.. 10 మంది అరెస్ట్‌, మరొకరు పరారీ

ఇంటి దొంగతనం కేసును ఛేదించిన ఘట్‌కేసర్ పోలీసులు.. 10 మంది అరెస్ట్‌, మరొకరు పరారీ

Select Suryaa Now
ఇంటి దొంగతనం కేసును ఛేదించిన ఘట్‌కేసర్ పోలీసులు.. 10 మంది అరెస్ట్‌, మరొకరు పరారీ

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో కిటికీ పగలగొట్టి సుమారు 18 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసిన కేసును ఘట్‌కేసర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పది మంది నిందితులను అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ వెల్లడించారు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామం లేక్‌వ్యూ ఎన్‌క్లేవ్‌లో ఉన్న వైష్ణవి రెసిడెన్సీలో ఈ చోరీ జరిగింది. ఈ నెల 14న బాధితుడు నవీన్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బోడుప్పల్‌లోని స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఈ నెల 18న తిరిగి వచ్చి చూడగా ఇంటి కిటికీ పగలగొట్టి ఉండటంతో పాటు బీరువాలో భద్రపరిచిన సుమారు 18 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో నవంబర్ 24న యంనంపేట్ ఎక్స్‌రోడ్డు వద్ద పది మంది నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు వెంకటేష్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి బంగారు నెక్లెస్, చంద్రహారం, బుట్ట కమ్మలు, గొలుసులు, ఉంగరాలతో పాటు సుమారు 24 తులాల వెండి ఆభరణాలు, రెండు ఐఫోన్లు, రూ.53 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ పి. కిరణ్ మాట్లాడుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, కిటికీలు, తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులను చోరీ చేయడం నిందితుల పద్ధతిగా ఉందన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ప్రజలు అపరిచితులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో విలువైన ఆభరణాలను ఇంట్లో ఉంచవద్దని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో సీఐ పి. కిరణ్, ఎస్‌ఐ ఎ. రాఘవేంద్ర, ఘట్‌కేసర్ పోలీసు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు బృందాన్ని కమిషనర్ అభినందించారు.