దీక్ష దివస్ పోస్టర్ ఆవిష్కరణ
బెజ్జంకి;ఈ నెల 29న అలుగునూర్ లో నిర్వహించనున్న దీక్షా దివస్ బహిరంగ సభను జయప్రదం చేయాలని వరంగల్ ఏఎంసీ మాజీ చైర్మన్ సదానందం పిలుపునిచ్చారు.బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి సదానందం దీక్ష దివస్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.దీక్ష దివస్ బహిరంగ సభకు ప్రజలు,పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరాడు.ఆయన వెంట సర్పంచ్ బొల్లం శ్రీధర్,సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్,చింతకింది శ్రీనివాస్ గుప్తా,కనగండ్ల తిరుపతి,ముక్కీస తిరుపతిరెడ్డి,దీటి బాలనర్సు,రాజ మహేందర్ రెడ్డి,ఎల శేఖర్ బాబు,వంగల నరేష్,బొడిగే అనిల్,తాడూరు రాంరెడ్డి,కొరివి తిరుపతి,శేఖర్ తదితరులున్నారు.