జగన్ తన కిరాయి రచయితలతో ప్రజాతీర్పును అవమానిస్తున్నారు : టీడీపీ నేత గురజాల మాల్యాద్రి
అమరావతి, మేజర్‌న్యూస్ :
జగన్మోహన్ రెడ్డి తన కిరాయి రచయితలతో 2024 ప్రజాతీర్పును అవమానిస్తున్నారని టీడీపీ నేత గురజాల మాల్యాద్రి మండిపడ్డారు. నవంబర్ 24న సాక్షి పత్రికలో వచ్చిన “బాబు చీకటి గెలుపు బట్టబయలు” అనే కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రిపోర్టర్స్ కలెక్టీవ్ వాళ్లు చెప్పిన 31వేల ఓట్ల గల్లంతు అనేది పచ్చి అబద్ధని పేర్కొన్న ఆయన.. ఆధారాలతో సహా సాక్షి అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టారు. నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. అంకెల గారెడీ, అభూత కల్పనతో జగన్ రెడ్డి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చీకటి గెలుపును చంద్రబాబుకి అంటగట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడమే జగన్ నైజమని ఆరోపించారు.
“రిపోర్టర్స్ కలెక్టీవ్ పేరుతో సాక్షిలో వచ్చిన వార్త పచ్చి అబద్ధం. ఎన్నికల అధికారులు విడుదల చేసిన గణంకాలు, వివరాలు ప్రకారం ఎనగ్జార్ 44లో 48 కాలమ్స్ ఉంటాయి. అందులో 42 కాలమ్ లో ప్రతి రెండు గంటలకు ఎన్నికల అధికారులు పోలింగ్ శాతం వివరాలు లెక్కిస్తారు. పోలింగ్ జరిగిన తర్వాత ఎన్నికల ఏజెంట్లకు ఫామ్ 17(సి) పార్ట్ 1 ఇస్తారు. అందులో ఎటువంటి అభ్యంతరం ఉంటే చెప్పమని ఏజెంట్లకు ఎన్నికల అధికారులు చెబుతారు. అలానే కౌంటింగ్ రోజు ఫామ్ 17(సి)లోని పార్ట్ 2 ఇస్తారు. అందులో ఈవీఎం, ఫామ్ 17(సి) పార్ట్ 1లోని ఓట్ల తేడా ఉంటే చెప్పమని మరోసారి ఏజెంట్లను అడుగుతారు. ఇలా ప్రతీసారి ఏజెంట్ల సంతకాలు తీసుకొనే ఎన్నికల ప్రక్రియా ముగుస్తుంది. ఇందులో అన్నీ పార్టీలకు చెందిన వేలమంది ఏజెంట్లు పాల్గొంటారు. ఇప్పుడు 2024 ఎన్నికల పోలింగ్ పై అనేక అసత్యాలు ప్రచారం చేస్తున్న సాక్షి అప్పుడు వాటిని ఎందుకు లేవనెత్తలేదు. వైసీపీ పార్టీకి చెందిన ఏజెంట్లు ఫామ్ 17(సి) పార్ట్ 1,2లపై ఎందుకు సంతకాలు పెట్టారు. ఇప్పుడు ఓట్ల తేడా విషయంలో రిపోర్టర్స్ కలెక్టీవ్ చెప్పినవి పచ్చి అబద్దాలు. అధికారిక లెక్కల ప్రకారం చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థులకు పోల్ అయిన మొత్తం ఓట్లు 14,60,881 ఓట్లు. పార్లమెంట్ పరిధిలో ఉండే మొత్తం ఎమ్మెల్యేలలకు పోలైన ఓట్లు 14,60,974 ఓట్లు అంటే వాటి మధ్య ఉన్న తేడా కేవలం 93 మాత్రమే. అలానే కుప్పం నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యేకి మధ్య వచ్చిన పోలింగ్ తేడా కేవలం 294 మాత్రమే. సాక్షి పత్రిక, వైసీపీ నాయకులు మాత్రం అక్కడ ఏదో జరిగిపోయిందనే అభూత కల్పన సృష్టిస్తున్నారు. అలానే సాయంత్రం 5 గంటల తర్వాత క్యూ లైన్లలో నిలుచున్న వారికి 56 వేల ఓటర్ల స్లిప్స్ ఇచ్చామని చెప్పడం పచ్చి అబ్బద్దం. కేవలం 9,600 మాత్రమే ఇచ్చారు. అలానే 2024 ఎన్నికల్లో సాయంత్ర 5 గంటల తర్వాత రాత్రి సమయానికి ఓట్ల తేడా కేవలం 13.82 శాతం మాత్రమే. 2019లో కూడా ఇలానే 13.8 శాతం వచ్చింది. ఇలా కల్పిత లెక్కలు, అంకెల గారిడీతో ప్రజలను జగన్మోహన్ రెడ్డి తప్పుదోవ పట్టించాలన చూస్తున్నారు. అయినా 2024 ఎన్నికలపై ఇంతలా అసత్యాలు ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆపధర్మ ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరో గుర్తుంచుకోవాలి. అలానే చిత్తూరులో పెద్దిరెడ్డి కన్నుసన్నలోనే కాదా అప్పటి కలెక్టర్ పనిచేశారు. రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే కేవలం చిత్తూరు పార్లమెంట్ మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు. అందులోనూ కుప్పం నియోజకవర్గాన్నే మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు. స్థానిక సంస్థల్లో కూటమి పార్టీలకు వస్తున్న ఆధారణ, గెలుపును చూసి జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పడానికి ఇలా రాయిస్తున్నారు. అలానే ఆడబిడ్డల ఆస్తిని కొట్టేస్తున్న జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర మహిళలు అసహ్యించుకుంటున్నారు. ఇలాంటి అంశాలన్నీ పక్కదారి పట్టించడానికి ఇప్పుడు తన సాక్షిలో అసత్య కథనాలు రాయిస్తున్నారు.
ప్రజా తీర్పును గౌరవించని జగన్ రెడ్డికి భవిష్యత్ లో సింగిల్ డిజిట్ ఖాయం
“ఈవీఎం, బ్యాలెట్ బాక్స్ అయినా కూటమి వైపే ప్రజలు ఉన్నారు. ఫేక్ వైబ్ సైట్ లో అసత్య కథనాలు రాయించి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 25శాతం ఓట్లతో వైసీపీ బొక్కబోర్ల పడ్డింది. కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికే ఇలాంటి కథనాలతో కాలం గడుపుతున్నారు. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్లు సాక్షి అబద్ధపు రాతలకు రిపోర్టర్స్ కలెక్టీవ్ తోడుగా నిలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిదే రక్తసిక్తమైన గెలుపు, చీకటి గెలుపు. చంద్రబాబు గారిది ప్రజలిచ్చిన గెలుపు, ప్రజలు మెచ్చిన గెలుపు.2019 ఎన్నికల ఓటమిని చంద్రబాబు గారు అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవించారు. కానీ ఇప్పుడు జగన్మోహన రెడ్డి తన ఓటమిని ప్రజలు, ఈవీఎంలపై నెడుతున్నారు. ప్రజాతీర్పును గౌరవించని జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్ లో సింగిల్ డిజిట్ ఖాయం. జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజాతీర్పును గౌరవించని జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్ లో సింగిల్ డిటిట్ ఖాయం.” అని హెచ్చరించారు.