క్రీడారంగంలో ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మరో ఘనత - కళాశాల చైర్మన్ .వెంకట రామిరెడ్డి
సూర్య, నంద్యాల బ్యూరో:జాతీయ స్థాయికి ఫెన్సింగ్ Y. వర్షిణి విద్యార్థిని ఎంపికయ్యారు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణంగా నిలిచింది. జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీ తరఫున జమ్మూ కాశ్మీర్‌లోని జమ్మూ యూనివర్సిటీలో డిసెంబర్ 4 నుండి 12 వరకు జరగనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫెన్సింగ్ మహిళల పోటీలలో పాల్గొనేందుకు వర్షిణి ఎంపికయ్యారు. ఈ ఎంపికతో విద్యార్థిని తన ప్రతిభను జాతీయ స్థాయిలో చాటుకునే అవకాశం దక్కించుకుంది. ఈ సందర్భంగా విద్యార్థినిని జాతీయ స్థాయి పోటీలకు పంపించే కార్యక్రమంలో కళాశాల చైర్మన్ .వెంకట రామిరెడ్డి, డైరెక్టర్ మల్లికార్జున రెడ్డి, ప్రిన్సిపాల్ హరి ప్రసాద్ రెడ్డి, డిప్లమా ప్రిన్సిపాల్ రామ సుబ్బా రెడ్డి, పాల్గొని విద్యార్థినికి అభినందనలు తెలియజేసి, పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో
మేనేజింగ్ డైరెక్టర్. దినేష్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు కళాశాలలో విద్యను అభ్యసించడంతో పాటు క్రీడారంగంలో కూడా ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయికి ఎదగాలని, అలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి క్రీడా అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని తెలిపారు. విద్య, క్రీడలు రెండింటిలోనూ విద్యార్థులు ఉన్నత విజయాలు సాధించేలా కళాశాల ప్రోత్సాహం నిరంతరం ఉంటుందని పేర్కొంటూ వర్షిణి ని అభినందించారు. జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎస్వీఆర్ విద్యార్థిని ఎంపిక కావడం కళాశాల క్రీడా విజయాల పరంపరలో మరో మైలురాయిగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఏ.ఐ హెచ్.ఓ. డి సుబ్బారెడ్డి, ఈ.సి హెచ్. ఓ .డి లక్ష్మీనారాయణ ఫిజికల్ డైరెక్టర్ విల్సన్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు
మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా