BREAKING
ఇంటి దొంగతనం కేసును ఛేదించిన ఘట్‌కేసర్ పోలీసులు.. 10 మంది అరెస్ట్‌, మరొకరు పరారీ ప్రముఖ క్రైస్తవుల సత్కారానికి నామినేషన్లు ఆహ్వానం:జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎం. సుధీర్ మేదినిపూర్లో జీవిత బీమా పథకం ప్రారంభం ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన రూడా చైర్మన్ బాలవికాస్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ మంజూరు సర్పంచ్ సున్నం సుదర్శన్ దిర్సంపల్లిలో ఉచిత వైద్య శిబిరం నైట్ కోర్టు కు వ్యతిరేకంగా కోర్టు విధులు బహిష్కరించిన… ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి… కూటమి అభ్యర్థి ముమ్మర ప్రసారం అభివృద్ధి హామీలతో స్వతంత్రం అభ్యర్థి సత్యనారాయణ గ్రామ రజక సంఘం అధ్యక్షులుగా రాచకొండ కనకయ్య నాడు భూమి ఉంటేనే రైతు బీమా.. నేడు భూమి లేకున్నా కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబబీమా! క్రీడారంగంలో ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మరో ఘనత - కళాశాల చైర్మన్ .వెంకట రామిరెడ్డి *పల్లెలపై కోరలు చాస్తున్న ఫైనాన్స్ భూతం!* మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

Select Suryaa Now
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

దుబ్బాక;రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకొని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక పురపాలిక కమిషనర్ ఏ.మహేష్ కుమార్ అన్నారు. బుధవారం పురపాలికలోని ధర్మాజీపేట 7, 8, 9, లచ్చపేట 10, 11వ వార్డుల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా దరఖాస్తుల ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో కుటుంబ యజమాని పేరున బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, కుటుంబ సభ్యులను నామినీగా చేర్చుకోవాలని సూచించారు. ఇప్పటివరకు పురపాలికలో 8 వేల కుటుంబాలకు గాను 906 కుటుంబాలు పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట వార్డు కౌన్సిలర్లు శోభారాణి, సాయికుమార్ గౌడ్, వనం రమేష్, బడుగు రాజు, పుర సిబ్బంది తదితరులు ఉన్నారు.