బాలవికాస్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ మంజూరు సర్పంచ్ సున్నం సుదర్శన్
కుకునూరుపల్లి;మండల పరిధిలోని ఎల్లాయగూడ గ్రామ సర్పంచ్ సున్నం సుదర్శన్ ఆధ్వర్యంలో బాల వికాస్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ప్రజలకు స్వచ్ఛమైన తగునీరు దించడమే లక్ష్యంగా గ్రామంలో వాటర్ ప్లాంట్ మంజూరు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బాలవికాస సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సంక్షేమ ఆరోగ్యం విద్య మరియు సత్యమైన త్రాగునీరు సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస్ ప్రతినిధులు ఉప సర్పంచ్ మాసపాక జానీ కార్యదర్శి నాగరాజు వార్డు సభ్యులు కరుణాకర్ ప్రవీణ్ మహేశ్వరి కనకమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు.